GOLD RATE TODAY GOLD PRICES REMAINS SAME AND SILVER PRICE INCREASED CHECK LATEST RATES HERE SK
Gold Rates today: బంగారం రేటు తగ్గిందా? పెరిగిందా? మార్కెట్లో నేటి ధరల వివరాలు
Gold Price Today: బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో సామాన్యులు అంచనా వేయడం కష్టమే. కొన్ని రోజులు తగ్గుతాయి. మరికొన్ని రోజులు పెరుగుతాయి. మరి ఇవాళ బంగారం ధరలు తగ్గాయా? పెరిగాయ? మార్కెట్లో నేటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం
Gold Rate today: హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44,900గా ఉంది. నిన్నటితో పోల్చితే ధరల్లో ఎలాంటి మార్పులేదు. స్థిరంగా ఉన్నాయి. ఒక్క గ్రాము పసిడి రేటు రూ. 4,490 పలుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
పెట్టుబడుల్లో వాడే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్లో రూ.48,980 పలుకుతోంది. నిన్నటితో పోల్చితే తగ్గలేదు.పెరగలేదు. ఒక్క గ్రాము స్వచ్ఛమైన బంగారం ధర రూ.4,898కి లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 44,900గా ఉంది. చెన్నైలో 45,330, ముంబైలో 46,950, న్యూఢిల్లీలో 47,040, కోల్కతాలో రూ.47,290, బెంళూరులో 44,900 పలుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. చెన్నైలో రూ.49,450, ముంబైలో 47,950, న్యూఢిల్లీలో 51,320, కోల్కతాలో 49,990, బెంగళూరులో 48,980, హైదరాబాద్లో, 48,980గా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
గతకొన్ని రోజులుగా బంగారం ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. ఒకసారి తగ్గితే.. మరోసారి తగ్గుతుంది.గత 10 రోజుల్లో బంగారం ధరలు నాలుగు సార్లు తగ్గగా... నాలుగు సార్లు పెరిగింది. రెండు సార్లు స్థిరంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
Silver Price: బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి రూ.73,100 పలుకుతోంది. 10 గ్రాముల వెండి 731కి లభిస్తోంది. నిన్నటితో పోల్చితే రూ.4 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
దేశవ్యాప్తంగా వెండి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడలో 10 గ్రాముల వెండి రేటు రూ.731కి లభిస్తోంది. ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, కేరళలో రూ.680 పలుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)