Gold Rate today: ప్రపంచ దేశాల్లో పరిస్థితులు ఆశాజనకంగా లేవు. కరోనా ముప్పు తొలగిపోలేదు. ఆర్థిక సమస్యలు అలాగే ఉన్నాయి. ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల సమస్య పెరుగుతోంది. డాలర్ మారకపు విలువ తగ్గుతోంది. ఈ పరిస్థితులన్నీ కలిసి బంగారం ధరలు పెరిగేలా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే... బిట్ కాయిన్ మళ్లీ బలపడుతోంది. వారం నుంచి దూసుకెళ్తూ... దాని విలువ రూ.22 లక్షల నుంచి రూ.26 లక్షలకు పెరిగింది. ఈ అంశం బంగారం ధరలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే గోల్డ్‌పై పెట్టుబడులను బిట్ కాయిన్ వైపు మళ్లించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల బంగారం ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Rates 26-7-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,470 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,760 ఉంది. నిన్న 8 గ్రాముల ధరలో మార్పు లేదు. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,700 ఉంది. నిన్న 10 గ్రాములు ధర స్థిరంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,877 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.39,016 ఉంది. నిన్న 8 గ్రాముల బంగారం ధరలో మార్పు లేదు. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.48,770 ఉంది. నిన్న 10 గ్రాములు ధర స్థిరంగా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటూ దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 26-7-2021: వెండి ధర నిన్న స్థిరంగా ఉంది. గత 10 రోజుల్లో 5 సార్లు తగ్గగా... 3 సార్లు పెరిగింది. 2 సార్లు స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.72 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.576 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.720 ఉంది. 100 గ్రాములు ధర రూ.7,200 ఉండగా... కేజీ వెండి ధర... రూ.72,000 ఉంది. నిన్న కేజీ వెండి ధరలో ఏ మార్పూ లేదు. జూన్ 30న వెండి ధర కేజీ రూ.72,900 ఉంది. ఇప్పుడు రూ.72,000 ఉంది. అంటే ఈ 25 రోజుల్లో వెండి ధర రూ.900 తగ్గినట్లు లెక్క. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లతో జాగ్రత్త: గత వారం స్టాక్ మార్కెట్లు గురు, శుక్ర వారాల్లో భారీ లాభాలు సాధించాయి కాబట్టి... ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ కోసం తిరిగి అమ్మకాలకు సిద్ధపడే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ అంశాల ప్రభావం ఈవారం స్టాక్ మార్కెట్లపై పడనుంది. అమెరికాలో యూఎస్ ఫెడరల్... వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాన్ని బట్టీ... మార్కెట్ కదలికలు ఉండనున్నాయి. జులై ఆఖరుతో... చాలా కంపెనీల ప్రాజెక్టు కాంట్రాక్టులు ముగుస్తాయి. అందువల్ల కూడా స్టాక్ మార్కెట్లలో కదలికలు జోరుగా ఉంటాయి. అలాగా ప్రధాన కంపెనీలు వాటి క్యూ1 ఫలితాల్ని ఈవారం ప్రకటిస్తాయి. అందువల్ల కూడా మార్కెట్లు కుదుపులకు లోనవుతాయి. అందువల్ల ఇన్వెస్టర్లు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. ముఖ్యంగా బ్రోకర్లు చెప్పినది పూర్తిగా నమ్మేయవద్దు. ఎవరికి వాళ్లు సొంతంగా విశ్లేషించుకోవడం అత్యుత్తమం. (ప్రతీకాత్మక చిత్రం)