Gold Rate today: ఎక్కడో ఏదో అయితే... ఆ ప్రభావం బంగారం ధరలపై పడుతుంది. అమెరికాలో డెల్టా వైరస్ కారణంగా కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. అక్కడ వ్యాక్సిన్లు కూడా సరిగా పనిచెయ్యట్లేదు. దాంతో... ఇన్వెస్టర్లు ఆందోళన చెంది... తమ పెట్టుబడులకు సేఫ్ ఆప్షన్‌గా బంగారంపై పెడుతున్నారు. దాంతో... బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. నిజానికి జులై 21, 22న బంగారం ధరలు భారీగా తగ్గాయి. మళ్లీ 23న భారీగా పెరిగాయి. మొత్తంగా చూస్తే... ధరలు పెరుగుతున్నట్లు క్లారిటీగా తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Rates 24-7-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,470 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,760 ఉంది. నిన్న 8 గ్రాముల ధర రూ.120 పెరిగింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,700 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.150 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,877 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.39,016 ఉంది. నిన్న 8 గ్రాముల బంగారం ధర రూ.136 పెరిగింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.48,770 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.170 పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటూ దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 24-7-2021: వెండి ధర 10 రోజుల్లో 5 సార్లు తగ్గగా... 4 సార్లు పెరిగింది. 1 సారి స్థిరంగా ఉంది. నిన్న ధర తగ్గింది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.72.30 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.578.40 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.723 ఉంది. 100 గ్రాములు ధర రూ.7,230 ఉండగా... కేజీ వెండి ధర... రూ.72,300 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.400 పెరిగింది. జూన్ 30న వెండి ధర కేజీ రూ.72,900 ఉంది. ఇప్పుడు రూ.72,300 ఉంది. అంటే ఈ 23 రోజుల్లో వెండి ధర రూ.600 తగ్గినట్లు లెక్క. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లలో జోష్: స్టాక్ మార్కెట్లు గురు, శుక్రవారం రెండు రోజులూ భారీ లాభాల్లో ముగిశాయి. శని, ఆదివారం ఉండవు కాబట్టి... సోమవారం ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం. సహజంగా గత 4 వారాలుగా ఇన్వెస్టర్లు శుక్రవారం మధ్యాహ్నం నుంచి షేర్ల అమ్మకాలు చేపడుతుంటే... శుక్రవారం నాడు మార్కెట్లు నష్టాల్లోకి వెళ్తున్నాయి. అలాంటిది నిన్న మాత్రం లాభాల్లోకి వెళ్లేలా చేశారు. విదేశాల నుంచి సంస్థాగత పెట్టుబడులు (FII)లు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం చాలా కంపెనీల షేర్లు కరోనాకు ముందు ఏ స్థాయిలో ఉన్నాయో... ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి చేరాయి. అందువల్ల ఇకపై అవి దూసుకెళ్తాయా లేదా అనేది డౌటే. అంటే... ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశాలు లేవు. సింపుల్‌గా చెప్పాలంటే... రూ.లక్ష పెట్టుబడి పెట్టేవారికి నెలకు రూ.2000 నుంచి రూ.4000 దాకా వచ్చే అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఐతే... జాగ్రత్తగా వ్యవహరించకపోతే... నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)