అమెరికా జాబ్స్ గణాంకాలు చాలా స్ట్రాంగ్‌గా నమోదు అయ్యాయి. దీని వల్ల బంగారం ధరపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. పసిడి రేటు ఏకంగా మూడు వారాల కనిష్టానికి దిగి వచ్చింది. ఈ విధంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పతనం కావడంతో.. ఆ ప్రభావం మన దేశంపై కూడా పడింది. అందుకే ఇక్కడ కూడా బంగారం ధరలు భారీగా దిగి వచ్చాయి. ఇది ఊరట కలిగించే అంశం.