దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు రూ.48,990గా, 24 క్యారెట్ల గోల్డ్ తులం రూ.53,440గా కొనసాగుతోంది. ఢిల్లీలో వెండి ధర రూ.1000 తగ్గి, 1కేజీకి రూ.65,700గా ధర ఉంది. ముంబైలోనూ వెండి ధర రూ.1000 తగ్గి కేజీ రూ.65,700గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం తులం రూ.48,990కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.53,440గా కొనసాగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
మిగతా నగరాలకు భిన్నంగా చెన్నై మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.320 తగ్గి, తులం రూ.49,120గా ఉంది. 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.350 తగ్గి, రూ.53,590గా ఉంది. ఇక్కడ వెండి రేటు రూ.1100 తగ్గి 1కేజీ ధర రూ.70,500గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం రూ.48,990గా, 24 క్యారెట్ల బంగారం రూ.53,440గా కొనసాగుతుండగా, వెండిపై రూ.1000 తగ్గి, 1కేజీ ధర రూ.65,700గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పడిపోతూనే వస్తోంది. గోల్డ్ రేట్లు ఏకంగా నాలుగు వారాల కనిష్టానికి తగ్గాయి. వెండి రేటు కూడా ఇదే ట్రెండ్ అనుసరిస్తోంది. సిల్వర్ రేటు 9 వారాల కనిష్టానికి దిగివచ్చింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 1902 డాలర్లకు పడిపోయింది. వెండి రేటు కూడా ఔన్స్‌కు 23.81 డాలర్ల వద్ద కదలాడుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)