గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు దిగి రావడంతో దేశీ మార్కెట్లో కూడా ఆ ప్రభావం కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ఈ రోజు మన మార్కెట్లో పసిడి రేట్లు నేల చూపులు చేశాయి. కాగా గత వారంలో బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. అయితే ఈ వారం ఆరంభంలోనే పసిడి రేటు నేలచూపులు చూసింది. ఇకపోతే ఈ వారం బంగారం, వెండి ధరలు ఎలా కదులుతాయో చూడాలి. వచ్చే ఏడాది పసిడి రేటు భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.