ఆదివారం నాడు 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి, తులం (10 గ్రాములు) రూ.48,000కు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.140 పెరిగి, తులం రూ.52,200కి ఎగసింది. వెండి మాత్రం ఏకంగా రూ.1200 తగ్గి, 1కేజీ ధర రూ.57,800కు దిగొచ్చింది. అయితే, ఆయా నగరాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులుంన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్ లో ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి, తులం రేటు రూ. 48,000గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.140 పెరిగి, తులం రూ.52,340కి పెరిగింది. కాగా, హైదరాబాద్ లో వెండి ధర భారీగా రూ.1500 తగ్గి, 1కేజీ రేటు రూ.63,500కు దిగింది. తెలంగాణలోని ఇతర నగరాల్లోనూ ఇవే ధరలున్నాయి (ప్రతీకాత్మక చిత్రం)
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.150 పెరిగి, తులం రూ.48,050గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.170 పెరిగి, తులం రూ.52,420గా ఉంది. వెండి ధర రూ.1500 తగ్గి, 1కేజీ రూ.63,500గా ఉంది. ఇక త్రివేండ్రం (కేరళ)లో 22క్యారెట్ల గోల్డ్ రూ. 48,000గా , 24 క్యారెట్ల బంగారం రూ.52,340, వెండి కిలో రూ.63,500గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
కేంద్రం పన్నుల పెంపు కారణంగా భారత్ లో భవిష్యత్తులో తులం బంగారం ధర రూ.2500మేర పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్‌తో రూపాయి పడి పోతున్న తీరు, బంగారం దిగుమతుల నేపథ్యంలో తాజా పెంపును ఊహించినప్పటికీ ప్రభుత్వం ఇంత త్వరగా ప్రకటిస్తుందని ఊహించలేదని మార్కెట్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)