పసిడి ప్రియులకు చిన్నపాటి బ్యాడ్ న్యూస్. ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి, తులం రూ.47,850కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి, తులం రూ.52,200కు చేరింది. వెండి ధర రూ.300 పెరిగి, 1కిలో 62,500 అయింది. ఆయా నగరాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.150 పెరిగి తులం రూ.47,950కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పెరిగి, తులం రూ.52,310కి చేరింది. చెన్నైలో వెండి రేటు ఏకంగా రూ.400 పెరిగి, కిలో ధర రూ. 67,000కు చేరింది. బెంగళూరు, కేరళలో 22 క్యారెట్ల బంగారం రూ.47,850గా, 24 క్యారెట్లు రూ.52,200కు పెరగ్గా, కిలో వెండి రూ.67,000కు చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)