ఇవాళ (25 జూన్ 2022, శనివారం) గోల్డ్ కొనుగోలు చేయాలని చూసే వారికి గుడ్ న్యూస్. దేశంలో మళ్లీ తగ్గాయి. నిన్న పరుగులు పెట్టిన బంగారం ధరలు నేడు తగ్గాయి. నిన్న ఎంతయితే ధర పెరిగిందే అంతే స్థాయిలో ఇవాళ ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.230 మేర ధర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 నుంచి రూ.47,450కి తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,990 నుంచి రూ.51,760కి చేరింది.
బెంగళూరులో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47.500... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,820వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,820వద్ద ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760వద్ద ఉంది.