యుద్దం, భారత్ సహా అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం, మన పొరుగు దేశాల్లో ఆర్థిక మాంద్యం, అమెరికాలో ఈ ఏడాది మరో మాంద్యం తప్పదనే అంచనాలు తదితర అంశాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే బంగారం ధర రూ.వెయ్యికిపైగా, వెండి ధర రూ.2వేల వరకు పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
అంతర్జాతీయ మార్కెట్ లో పెరుగుతున్న క్రమంలో ఇండియాలోనూ మార్కెట్లు ఎగిసిపడుతున్నాయి. శనివారం నాడు 22 క్యారెట్ల బంగారం తులం(10 గ్రాములు) రూ.400 పెరిగి, ధర రూ.46,700కి చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.440 పెరిగి తులం ధర రూ.50,950కి పెరిగింది. వెండి ధర రూ.3,300 తగ్గి, 1కిలో రూ.61,700గా ఉంది. అయితే, దక్షిణాదిలోని అన్ని నగరాల్లో వెండి రేటు భారీగా పెరగడం గమనార్హం.(ప్రతీకాత్మక చిత్రం)
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం తులం రూ. రూ.46,700గా, 24 క్యారెట్ల ధర రూ.50,950గా, వెండి 1కిలో రూ.61,700గా ఉంది. ముంబైలో 11 క్యారెట్లు రూ.46,700గా, 24 క్యారెట్ల ధర రూ.50,950గా, వెండి 1కిలో రూ.61,700గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం రూ. 46,700గా, 24 క్యారెట్ల బంగారం రూ.50,950గా, వెండి 1కిలో రూ.61,700గా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం తులం అత్యధికంగా రూ.47,860గా ఉంది. 24 క్యారెట్ల బంగారం కూడా గరిష్టంగా రూ.52,210గా ఉంది. చెన్నైలో 1 కిలో వెండి రూ. 65,900గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.46,700గా, 24 క్యారెట్ల ధర రూ.50,950గా, 1కేజీ వెండి రూ.65,900గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం రూ.46,700గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950గా, వెండి కిలో రూ65,900గా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)