ఉక్రెయిన్ రష్యా యుద్దం, భారత్ సహా అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం, మన పొరుగు దేశాల్లో ఆర్థిక మాంద్యం, అమెరికాలో ఈ ఏడాది మరో మాంద్యం తప్పదనే అంచనాలు తదితర అంశాల నేపథ్యంలో బంగారానికి సంబంధించి పరిణామాలు మారుతున్నాయి. భారతీయ రిజర్వు కొంతకాలంగా తన బంగారం నిల్వలను పెంచుకుంటుడం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
పలు అంశాల క్రమంలో అంతర్జాతీయ మార్కెట్ లో పెరుగుతున్నా, ఇండియాలో మాత్రం గడిచిన 3 రోజులుగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం నాడు 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.46,250గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450గా ఉంది. వెండి 1కిలో ధర రూ.59,400గా ఉంది. ఆయా నగరాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లు రూ.46,250, 24 క్యారెట్లు రూ.50,450గా ఉంది. చెన్నై నగరంలో మాత్రం బంగారం, వెండి రేట్లు పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్ రూ.47,370గా, 24 క్యారెట్లకు రూ.51,670గా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. గోల్డ్ రేటు 0.42 శాతం పెరిగి ఒక ఔన్సు 1821 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి రేటు ఔన్స్‌కు 0.07 శాతం పెరిగి 21.58 డాలర్లుగా ఉంది. బంగారానికి డిమాండ్ తగ్గొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నా, విదేశీ బ్రోకరేజ్ సంస్థ మాత్రం పసిడి డిమాండ్ ఇంకాపైపైకి పోతుందని అంచనావేస్తోంది. భారత్ లోకి బంగారం దిగుమతులు గతంలో కంటే భారీగా పెరిగాయి.(ప్రతీకాత్మక చిత్రం)