మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం సోమవారం నాడు రూ.46,250గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.50,450గా ఉంది. వెండి 1 కేజీ ధర రూ.63,700గా ఉంది. తెలంగాణలోని మిగతా నగరాల్లోనూ నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి. మార్కెట్ లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450గా ఉంది. కిలో రూ.63,700గా ఉంది. విజయవాడతోపాటు, ఇతర నగరాల్లోనూ ధరలు ఇవే.(ప్రతీకాత్మక చిత్రం)
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం తులం రూ.46,450గా, 24 క్యారెట్ల బంగారం రూ.50,670గా , వెండి కిలో రూ.59,400గా,ఉంది. ముంబైలో 22 క్యారెట్లు రూ.46,250గా, 24 క్యారెట్లు రూ.50,450గా, వెండి కిలో రూ.59,400గా ఉంది. ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లు రూ.46,250గా, 24 క్యారెట్లు రూ.50,450గా, వెండి కిలో రూ.59,400గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం అత్యధికంగా రూ.47,370గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం కూడా గరిష్టంగా రూ.51,670గా ఉంది. ఇక్కడ వెండి ధర కిలో రూ.63,700గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం తులం రూ.46,250గా, 24 క్యారెట్ల బంగారం రూ.50,450గా, కిలో వెండి ధర రూ.63,700గా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ రిజర్వు బంగారం నిల్వలపై శ్రద్ద పెంచింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆరు నెలల్లో ఆర్బీఐ బంగారం నిల్వలను 16.58 టన్నుల మేర పెంచుకుంది. దాంతో 2022 మార్చి చివరి నాటికి మన సెంట్రల్ బ్యాంక్ వద్దనున్న పసిడి ఖజానా 760.42 టన్నులకు పెరిగింది. ఇటీవల విదేశీ మారకం నిల్వలు భారీగా తగ్గుకుంటూ వచ్చిన తరుణంలో ఆర్బీఐ గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంటూ రావడం గమనార్హం.(ప్రతీకాత్మక చిత్రం)