మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగి వచ్చాయి. బంగారం ధర పది గ్రాములకు రూ. 55,416 వద్ద ఉంది. ఆల్టైమ్ గరిష్ట స్థాయి నుంచి చూస్తే.. బంగారం ధరలు రూ. 3431 మేర తగ్గాయని చెప్పుకోవచ్చు. బంగారం జీవిత కాల గరిష్ట స్థాయి రూ. 58,850గా ఉంది.