వెండి రేటు విషయానికి వస్తే.. వెండి ధర గత నాలుగు రోజుల్లో రెండు సార్లు పైకి చేరింది. మరో రెండు సార్లు పడిపోయింది. అయితే మొత్తంగా చూస్తే ఈ నాలుగు రోజుల్లో సిల్వర్ రేటు రూ. 900 మేర దిగి వచ్చింది. వెండి కడియాలు, గజ్జలు, గొలుసులు కొనాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వెండి రేటు కేజీకి రూ. 73,100 వద్ద ఉంది.
ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేట్ల రేట్లను గమనిస్తే.. బంగారం ధరలు తగ్గాయి. గోల్డ్ రేటు ఔన్స్‌కు 0.14 శాతం మేర క్షీణించింది. దీంతో బంగారం రేటు ఇప్పుడు ఔన్స్‌కు 1795 డాలర్ల వద్ద కదలాడుతోంది. వెండి రేటు అయితే 0.25 శాతం తగ్గింది. ఔన్స్‌కు 23.14 డాలర్ల వద్ద ఉంది. కాగా బంగారం ధర గత వారంలో 1800 డాలర్ల పైన కదలాడుతూ ఉండేది.