Gold Price today: బంగారం ధర కొద్దిగా తగ్గగా... వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి... ఇక సౌత్ ఇండియాలో కూడా బంగారు నగల కొనుగోళ్లు పెరుగుతాయి. అందువల్ల త్వరలో ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఐతే... నగలు ఇప్పుడు కొనాలా వద్దా అని అనుకునేవాళ్లు... మరికొన్ని రోజులు ఆగవచ్చు అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. తగ్గే ట్రెండ్ నడుస్తోంది కాబట్టి... ఇంకా ఎన్ని రోజులు తగ్గుతుందో చూసుకొని... మళ్లీ పెరిగే దశ వచ్చే వరకూ ఆగి... వరుసగా 3 రోజులు పెరిగితే... సరిగ్గా ఆ టైమ్‌లో నగలు కొనుక్కోవాలని సూచిస్తున్నారు. తద్వారా తక్కువ ధరకే నగలను పొందినట్లు అవుతుంది అంటున్నారు. ఇప్పుడే కొంటే... ధర ఇంకా తగ్గితే... తర్వాత... తక్కువ రేటుకి పొందలేకపోయామే అని బాధపడాల్సి రావచ్చు అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరల్లో పెరుగుదల ఉంది. మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు రూ.41,100 ఉండగా... 130 రోజుల్లో రూ.2,740 పెరిగింది. అలాగే... 24 క్యారెట్ల ప్యూర్ పెట్టుబడుల గోల్డ్ 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా... 130 రోజుల్లో అది రూ.2,990 పెరిగింది. దీన్ని బట్టీ... 4 నెలలుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం తగ్గుతున్న ట్రెండ్ నాలుగు రోజుల నుంచి కనిపిస్తోంది. తాజా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Rates 9-8-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,384 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,072 ఉంది. నిన్న 8 గ్రాముల ధర రూ.8 తగ్గింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.43,840 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.10 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,840 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,840 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,000 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,840 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,390 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.45,990 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,340 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.45,690 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 9-8-2021: వెండి ధర నిన్న భారీగా తగ్గింది. గత 10 రోజుల్లో 6 సార్లు తగ్గగా... 3 సార్లు పెరిగింది. 1 సారి స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.65 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.520 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.650 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,500 ఉండగా... కేజీ వెండి ధర... రూ.65,000 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.5,200 తగ్గింది. ఏప్రిల్ 1న వెండి ధర కేజీ రూ.67,300 ఉంది. ఇప్పుడు రూ.65,000 ఉంది. అంటే 130 రోజుల్లో వెండి ధర రూ.2,300 తగ్గినట్లు లెక్క. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: స్టాక్ మార్కెట్లు ఇవాళ కొద్దిగా లాభాల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే... కార్పొరేట్ కంపెనీలు తమ క్యూ1 ఫలితాల్ని విడుదల చేస్తున్నాయి. ఆ ఫలితాలు ఆసక్తిగా లేకపోతే మాత్రం మార్కెట్లు నష్టాల్లోకి వెళ్తాయి. ప్రస్తుతం దేశంలో వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇది స్టాక్ మార్కెట్‌పై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఇన్వెస్టర్లు ఈ వారం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మార్కెట్‌ని డీప్‌గా గమనించాలి. లేదంటే అడ్డంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతున్నాయో లేదా గమనించాలనీ, అలాగే రూపాయి విలువ, క్రూడ్ ఆయిల్ ధరలు, ఆసియా మార్కెట్లను లెక్కలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)