Gold Price: బంగారం ధరలు సైలెంట్‌గా పెరుగుతున్నాయి. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. దేశంలో కరోనా పెరుగుతూ ఉండటం, ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు, దేశంలో పండుగల సీజన్ వచ్చేయడం, విదేశీ పెట్టుబడుల్లో జోరు ఇలాంటి అంశాలన్నీ కలిసి బంగారం ధరలు పెరిగేలా చేస్తున్నాయి. 18 రోజులుగా గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Trend: ఆగస్ట్ 12 నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ 18 రోజుల్లో 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు... రూ.1,210 పెరిగింది. ఈ సంవత్సరం లెక్క చూస్తే... మార్చి 31న బంగారం ధర అతి తక్కువగా ఉంది. ఆ రోజున 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడేమో... రూ.44,560 ఉంది. అంటే 151 రోజుల్లో ధర రూ.3,460 పెరిగింది. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,560 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,560 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,560 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,560 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.45,080 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,710 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.47,110 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,660 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 30-8-2021: వెండి ధర నిన్న స్థిరంగా. గత 10 రోజుల్లో వెండి ధర రూ.1,300 పెరిగింది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.68.70 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.549.60 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.687 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,870 ఉండగా... కేజీ వెండి ధర... రూ.68,700 ఉంది. నిన్న కేజీ వెండి ధర స్థిరంగా ఉంది. మార్చి 31న కేజీ వెండి ధర రూ.67,300 ఉంది. ఇప్పుడు రూ.68,700 ఉంది. అంటే... ఈ 151 రోజుల్లో వెండి ధర రూ.1,400 పెరిగింది. ఐతే... జూన్ 1న కేజీ వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.68,700 ఉంది. అంటే... ఈ 90 రోజుల కాలంలో ధర రూ.8,100 తగ్గింది. అందువల్ల ప్రస్తుతం వెండి ధర తక్కువగానే ఉంది అనుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: ఆగస్ట్ నెల ఇన్వెస్టర్లకు బాగా కలిసొచ్చింది. స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదుచేశాయి. జులై 30న 52,586 దగ్గరున్న సెన్సెక్స్ ఇప్పుడు 56,124 దగ్గర ఉంది. నెల రోజుల్లో 3,538 పాయింట్లు పెరిగింది. ఇన్వెస్టర్లకు దాదాపు రూ.35 లక్షల కోట్ల సంపద పెరిగినట్లే. ఇందులో ప్రధానంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. తెరవెనక ఎలాంటి అక్రమాలూ జరగకుండా ఉంటే... ఇవాళ కూడా మార్కెట్లు దూసుకెళ్లగలవు. ఐతే... నెలాఖరు కాబట్టి... చిన్న, మధ్యస్థాయి ఇన్వెస్టర్లు... లాభాల స్వీకరణకు మొగ్గు చూపగలరు. అదే జరిగితే... మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకుంటాయి. పైగా దేశంలో కరోనా పెరుగుతోంది కాబట్టి ఆ ప్రభావం కూడా మార్కెట్లకు నెగెటివ్ ప్రభావంగా మారగలదు. అందువల్ల ఇవాళ షేర్లు కొనాలి అనుకునేవారు... ఈ రెండ్రోజులూ ఆగి... సెప్టెంబర్ 1న కొనుక్కోవడం మేలు అంటున్నారు నిపుణులు. (image credit - twitter - reuters)