Gold Price: బంగారం నగలు కొనుక్కోవాలి అని అనుకునేవారికి ఇదో నిరాశ కలిగించే వార్త. 17 రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తగ్గితే బాగుండు అని ప్రజలు కోరుకుంటుంటే... విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడులతో బంగారం ధర రాకెట్లా దూసుకుపోతోంది. ఇక ఇప్పట్లో ధర తగ్గదనే అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Trend: ఆగస్ట్ 12 నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ 17 రోజుల్లో 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు... రూ.1,200 పెరిగింది. ఈ సంవత్సరం మొత్తం గమనిస్తే... మార్చి 31న బంగారం ధర అతి తక్కువగా ఉంది. ఆ రోజున 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడేమో... రూ.44,550 ఉంది. అంటే 150 రోజుల్లో ధర రూ.3,450 పెరిగింది. బంగారంపై విదేశాల నుంచి పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయి. దానికి తోడు తాలిబన్ల వల్ల మళ్లీ చిన్నపాటి యుద్ధాలు జరుగుతాయనే అంచనా ఉంది. అందువల్ల బంగారాన్ని సేఫ్ ఇన్వెస్టిమెంట్ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. ఆ క్రమంలో ధరలు పెరుగుతున్నాయి. నేటి రేట్లు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,550 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,550 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,550 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,550 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.45,070 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,700 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.47,100 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,650 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 29-8-2021: వెండి ధర నిన్న కొంత పెరిగింది. గత 10 రోజుల్లో వెండి ధర రూ.600 పెరిగింది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.68.70 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.549.60 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.687 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,870 ఉండగా... కేజీ వెండి ధర... రూ.68,700 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.800 పెరిగింది. మార్చి 31న కేజీ వెండి ధర రూ.67,300 ఉంది. ఇప్పుడు రూ.68,700 ఉంది. అంటే... ఈ 150 రోజుల్లో వెండి ధర రూ.1,400 పెరిగింది. ఐతే... జూన్ 1న కేజీ వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.68,700 ఉంది. అంటే... ఈ 89 రోజుల కాలంలో ధర రూ.8,100 తగ్గింది. అందువల్ల ప్రస్తుతం వెండి ధర తక్కువగానే ఉంది అనుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: స్టాక్ మార్కెట్లు మూడు వారాలుగా దూసుకుపోతున్నాయి. కారణం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులే (FDI). ఇండియాకి నైరుతీ రుతుపవనాలు ఎలాగో... స్టాక్ మార్కెట్లకు ఈ FDIలు అలాగ. ఆర్థిక సంస్కరణల కారణంగా... విదేశాల నుంచి ఇండియాలోని కంపెనీలకు పెట్టుబడులు వస్తున్నాయి. దాంతో వాటి విలువ పెరుగుతూ... స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. FDIలు వచ్చిన వెంటనే వెళ్లిపోవు. కాబట్టి... దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు వెంటనే పడిపోవు. కొంతకాలం స్థిరంగా ఉండగలవు. కాబట్టి... ఇలాంటి సమయంలో... ఇన్వెస్టర్లు ఏ స్టాక్స్ షేర్లు పెరుగుతున్నాయో గమనించుకొని కొనుక్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేస్తున్న ఆటోమొబైల్ కంపెనీల్లోకి పెట్టుబడుల ప్రవాహం సాగుతోంది. కాబట్టి వాటి షేర్ల విలువ పెరుగుతోందని చెబుతున్నారు. (image credit - twitter - reuters)