Gold Price: ప్రపంచ దేశాల్లో ఎక్కడో ఏదో జరిగితే... ఆ ప్రభావం వచ్చి బంగారం ధరలపై పడుతుంది. ఎన్నో ఏళ్లుగా డబ్బు కూడబెట్టి... ఎంతో కొంత గోల్డ్ కొనాలి, పిల్లలకు పెళ్లి చేయాలి అనుకునే తల్లిదండ్రులకు... ఈ బంగారం ధరలే హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్నాయి. రెండ్రోజుల కిందట నగలు కొనుక్కున్న వారు... ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకోగలరు. ఎందుకంటే... నిన్న, మొన్న బంగారం ధరలు పెరిగాయి. త్వరలోనే ఇవి రూ.50వేల మార్కును టచ్ చేస్తాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Trend: ఆగస్ట్ 12 నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ 13 రోజుల్లో 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు... రూ.1100 పెరిగింది. ఈ సంవత్సరం మొత్తం గమనిస్తే... మార్చి 31న బంగారం ధర అతి తక్కువగా ఉంది. ఆ రోజున 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడేమో... రూ.44,450 ఉంది. అంటే 146 రోజుల్లో ధర రూ.3,350 పెరిగింది. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. దానికి తోడు... తాలిబన్లతో జట్టు కట్టి... జమ్మూకాశ్మీర్ అంశాన్ని తేల్చుతామని తాజాగా పాకిస్థాన్ ప్రకటించింది. అంటే మళ్లీ ఆ దేశం... కాశ్మీర్లో కల్లోలం రేపుతున్నట్లే. ఫలితంగా దేశంలో ఉద్రిక్తత ఉంటుంది. అది బంగారం ధరలు పెరిగేలా చేస్తుంది. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Rates 25-8-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,445 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,560 ఉంది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,450 ఉంది. నిన్న 10 గ్రాముల బంగారం రూ.200 పెరిగింది. మొన్న రూ.100 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,450 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,450 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,450 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,450 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,850కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,600 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,950 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,650 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 25-8-2021: వెండి ధర వరుసగా మూడో రోజు పెరిగింది. గత 10 రోజుల్లో వెండి ధర రూ.500 తగ్గింది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.67.70 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.541.60 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.677 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,770 ఉండగా... కేజీ వెండి ధర... రూ.67,700 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.1000 పెరిగింది. మార్చి 31న కేజీ వెండి ధర రూ.67,300 ఉంది. ఇప్పుడు రూ.67,700 ఉంది. అంటే... ఈ 146 రోజుల్లో వెండి ధర రూ.400 పెరిగింది. ఐతే... జూన్ 1న కేజీ వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.67,700 ఉంది. అంటే... ఈ 85 రోజుల కాలంలో ధర రూ.9,100 తగ్గింది. అందువల్ల ప్రస్తుతం వెండి ధర తక్కువగానే ఉంది అనుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: నిన్న, మొన్న దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. నిన్న సెన్సెక్స్ 403 పాయింట్లు బలపడగా... నిఫ్టీ 128 పాయింట్లు పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు... మొదటి క్వార్టర్ అంటే... ఏప్రిల్ నుంచి జూన్ వరకూ... వృద్ధి రేటు 18.5 శాతం ఉంటుంది అని SBI అంచనా వేయడంతో... నిన్న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. ఐతే... బాగా లాభపడిన కంపెనీల్లో చాలా వాటికి భారీగా అప్పులు ఉన్నాయి. వాటి బ్యాలెన్స్ షీట్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. మరి అలాంటి కంపెనీల్లో షేర్లను ప్రజలు ఎందుకు కొంటున్నారన్నది తేలాల్సిన ప్రశ్న. బ్లాక్ మనీ ఉన్న వాళ్లే... ఇలా అప్పులున్న కంపెనీల్లోనూ వాటాలు కొనేస్తారనే వాదన ఉంది. కాబట్టి రియల్ ఇన్వెస్టర్లు తాము కష్టపడి సంపాదించుకున్న సొమ్మును స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఇలాంటి లోతైన విషయాల్ని గ్రహించాల్సి ఉంటుందని మంచి నిపుణులు చెబుతున్నారు. టాప్ గెయినర్‌గా ఉన్నంత మాత్రాన ఆ కంపెనీ అద్భుతమైనదని అనుకోవడానికి వీల్లేదని చెబుతున్నారు. అందుకే పెట్టుబడి పెట్టేటప్పుడు మదుపర్లు లోతుగా విశ్లేషించుకొని నిర్ణయాలు తీసుకోవాలి అంటున్నారు. (image credit - twitter - reuters)