Gold Price: బంగారం ధరలు పెరిగిపోతుంటే... వెండి ధరలు తగ్గుతున్నాయి. ఐతే... ఎవరైనా బంగారం నగలు కొనుక్కునేందుకే ఆసక్తి చూపిస్తారు. పైగా ఇప్పుడు జ్యువెలరీ షోరూంలు మంచి ఆఫర్లు ప్రటిస్తున్నాయి. కాబట్టి బంగారం నగలు కొనుక్కోవాలి అనుకునేవారు ఇప్పుడే వెంటనే కొనుక్కోండి అని సూచిస్తున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ఇప్పుడు కొనుక్కోకపోతే... త్వరలోనే బంగారం ధరలు రూ.50వేలు దాటి పెరుగుతాయని చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం... ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల సమస్యే. అక్కడ రగులుతున్న చిచ్చు... ప్రపంచ దేశాలకు ఉగ్రవాద ముప్పుగా మారనుంది. ఫలితంగా బంగారం ధరలు భగ్గుమనడం ఖాయం అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Trend: ఆగస్ట్ 12 నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ 12 రోజుల్లో 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు... రూ.900 పెరిగింది. మరోలా కూడా లెక్క వేసుకుందాం. ఈ సంవత్సరం మార్చి 31న బంగారం ధర అతి తక్కువగా ఉంది. ఆ రోజున 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడేమో... రూ.44,250 ఉంది. అంటే 145 రోజుల్లో ధర రూ.3150 పెరిగింది. తాలిబన్ల అరాచకాలు ఎక్కువై... ప్రపంచ దేశాలు వాళ్లతో యుద్ధానికి దిగితే... బంగారం ధరలు రూ.60వేలకు చేరే అవకాశాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. కాబట్టి... నగలు కొనుక్కోవాలి అనుకునేవారు ఆలస్యం చెయ్యకుండా ఇప్పుడే కొనుక్కోండి అంటున్నారు. భవిష్యత్తులో ధరలు తగ్గినా... ఇప్పుడున్నదాని కంటే తగ్గే అవకాశాలు దాదాపు లేవు అంటున్నారు. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,250 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,250 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,250 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,250 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,610కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,400 ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,700 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,250 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 24-8-2021: వెండి ధర నిన్న కొద్దిగా పెరిగింది. గత 10 రోజుల్లో వెండి ధర రూ.570 తగ్గింది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.66.70 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.533.60 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.667 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,670 ఉండగా... కేజీ వెండి ధర... రూ.66,700 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.40 పెరిగింది. మార్చి 31న కేజీ వెండి ధర రూ.67,300 ఉంది. ఇప్పుడు రూ.66,700 ఉంది. అంటే... ఈ 145 రోజుల్లో వెండి ధర రూ.600 తగ్గింది. ఐతే... జూన్ 1న కేజీ వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.66,700 ఉంది. అంటే... ఈ 84 రోజుల కాలంలో ధర రూ.10,100 తగ్గింది. అందువల్ల ఇప్పుడు వెండి నగలు కొనుక్కోవాలో మనకు మనం ఆలోచించుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: నిన్న దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 226 పాయింట్లు బలపడగా... నిఫ్టీ 46 పాయింట్లు పైగి పెరిగింది. ఆఫ్ఘనిస్థాన్లో కల్లోలం రేగుతున్న సమయంలో... దేశీయ మార్కెట్లు 2 వారాలుగా దూసుకెళ్తూ ఉండటం సందేహాస్పదం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. నిజంగానే సెన్సెక్స్ పెరిగితే ఆనందమే గానీ... ఏ బ్లాక్ మనీయో పెట్టుబడుల రూపంలో మార్కెట్ లోకి వస్తూ ఉంటే ప్రమాదమే అంటున్నారు. బ్లాక్ మనీ వల్ల ఏదో ఒక రోజున మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం ఉంటుంది అంటున్నారు. అందువల్ల చిన్న, మధ్యతరహా ఇన్వెస్టర్లు ఇలాంటప్పుడే లోతుగా విశ్లేషించుకుంటూ ఉండాలి అంటున్నారు. ఇంత భారీగా సెన్సెక్స్, నిఫ్టీ పెరిగేంత సీన్ ఇప్పుడు ఇండియాలో లేదు అంటున్నారు. అయినా సరే పెరుగుతున్నాయంటే... కాస్త జాగ్రత్తగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఊరూ పేరూ తెలియని కంపెనీల షేర్లు కొనేవారు నష్టపోయే ప్రమాదం ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు.