Gold Price: బంగారం అనేది ఇండియాలో సెంటిమెంట్. ప్రతీ ఆడపడుతూ... ఎంతో కొంత బంగారం కలిగివుండాలన్నది సంప్రదాయం. ఐతే... బంగారం ధరలు మాత్రం ఎక్కువగానే ఉంటున్నాయి. ప్రస్తుతం 44వేల దగ్గర ఉన్న బంగారం... ఇంకా తగ్గితే మంచిదే కానీ... పెరిగే సంకేతాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం బంగారంపై బాగా ఉంటుందనీ... అలాగే వినాయక చవితి కూడా త్వరలో రాబోతోంది కాబట్టి... గోల్డ్ రేట్స్ పెరగడం ఖాయం అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Trend: గత 10 రోజుల్లో 22 క్యారెట్ల నగల బంగారం రూ.1100 పెరిగింది. అలాగే... రూ.310 తగ్గింది. మొత్తంగా చూస్తే... రూ.790 పెరిగినట్లే. నాలుగు రోజులుగా తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా... బంగారం ధరలు ప్రస్తుతానికి పెరుగుదలతోనే ఉన్నాయి అనుకోవాల్సి ఉంటుంది. మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడేమో... రూ.44,140 ఉంది. అంటే 145 రోజుల్లో ధర రూ.3040 పెరిగింది. ఇది ఇంకా పెరిగితే నగలు కొనుక్కోవడం కష్టం అవుతుంది. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,140 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,140 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,140 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,140 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,640కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,290 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,490 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,200 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 23-8-2021: వెండి ధర నిన్న భారీగా పెరిగింది. గత 10 రోజుల్లో వెండి ధర రూ.840 తగ్గింది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.66.66 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.533.28 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.666.6 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,666 ఉండగా... కేజీ వెండి ధర... రూ.66,660 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.4,960 పెరిగింది. జూన్ 1న కేజీ వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.66,660 ఉంది. అంటే... ఈ 83 రోజుల కాలంలో ధర రూ.10,140 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: ఇవాళ చిన్న ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. పెట్టుబడిదారులు ఇవాళ లాభాలను వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంది. అందువల్ల ప్రధాన కంపెనీల షేర్లు నష్టాల్లోకి జారుకునే ప్రమాదం ఉంటుంది. ఇండియాలో పెద్దగా డెవలప్మెంట్స్ ఏవీ ఇప్పుడు లేవు. కానీ అంతర్జాతీయంగా తాలిబన్ల ఇష్యూ బాగా నడుస్తోంది. అమెరికా ఫెడరల్ బ్యాంక్ నిర్ణయాలు కూడా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. బెస్ట్ మెథడ్ ఏంటంటే... ఇండియాలో టాప్ 20 కంపెనీల్లో మాత్రమే షేర్లు కొనుక్కుంటే... అవి దీర్ఘకాలంలో అప్ ట్రెండ్‌లోనే ఉంటాయనీ... అందువల్ల ఎప్పుడైనా అవి నష్టాల్లోకి జారుకున్నా... ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఐతే... ఈ టాప్ కంపెనీల్లో ఎక్కువ లాభాలు మాత్రం రావని చెబుతున్నారు. రిస్క్ తక్కువగా ఉండాలి అనుకునేవారు టాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చెయ్యడమే ఉత్తమం అని సూచిస్తున్నారు. (image credit - twitter - reuters)