Gold Price: గత వారం కాస్త పెరిగిన బంగారం ధరలు... ఈ వారం కొద్దిగా తగ్గినా... మళ్లీ పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకాలు మరింత పెరిగితే... ప్రపంచ దేశాల్లో అలజడి ఎక్కువవుతుంది. అందువల్ల ప్రపంచ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లి... వాటిలో సంపద బంగారంలోకి పెట్టుబడుల రూపంలో వస్తుంది. అదే జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. ప్రస్తుతానికి కొద్దిగా తగ్గాయి. ఎంత తగ్గాయో, ఇప్పుడు ఎంత ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Trend: గత 10 రోజుల్లో 22 క్యారెట్ల నగల బంగారం రూ.1100 పెరిగింది. అలాగే... రూ.300 తగ్గింది. మొత్తంగా చూస్తే... రూ.800 పెరిగినట్లే. అంతే... బంగారం ధరలు ప్రస్తుతానికి పెరుగుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఏడాది కాలంతో పోల్చితే... ఈ సంవత్సరం మార్చి 31న బంగారం ధరలు అతి తక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత నుంచి కంటిన్యూగా పెగుదలే కనిపిస్తోంది. మార్చి 31 నుంచి ఇప్పటివరకూ నగల బంగారం ధర 10 గ్రాములు రూ.3,050 పెరిగింది. ఇలా చూసినా బంగారం ధరలు పెరుగుతున్నట్లే లెక్క. మరి నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,150 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,150 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,150 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,150 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,650కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,300 ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,500 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,210 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 22-8-2021: వెండి ధర నిన్న భారీగా తగ్గింది. గత 10 రోజుల్లో వెండి ధర రూ.6200 తగ్గింది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.61.70 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.493.60 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.617 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,170 ఉండగా... కేజీ వెండి ధర... రూ.61,700 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.5,300 తగ్గింది. వెండి నగలు కొనుక్కోవాలి అనుకునేవారు ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఎందుకంటే... జూన్ 1న కేజీ వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.61,700 ఉంది. అంటే... ఈ 82 రోజుల కాలంలో ధర రూ.15,100 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: స్టాక్ మార్కె్ట్లకు ఆదివారం సెలవు అయినప్పటికీ... సోమవారం ఎలా ఉంటాయి అనే టెన్షన్ చాలా మందికి ఉంటుంది. ప్రస్తుతానికి ప్రపంచ పరిస్థితులు అంత గొప్పగా గానీ, మరీ అంత ప్రమాదకరంగా గానీ లేవు. ప్రపంచ కరోనా కొద్దిగా తగ్గింది. తాలిబన్లపై ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి. అందువల్ల... ప్రపంచ పరిస్థితులు మెరుగు అవ్వొచ్చు. కాబట్టి... స్టాక్ మార్కెట్లలోకి భారీగా నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐతే... చిన్న మదుపర్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్లను ఆకర్షించేందుకే పుట్ట గొడుగుల్లాంటి చాలా మోసపూరిత కంపెనీలు ఉండొచ్చు. అందువల్ల పెట్టుబడి పెట్టేవారు ది బెస్ట్ కంపెనీలు, వాటి పెర్ఫార్మెన్స్ చూసి స్టాక్స్ కొనుక్కోవడం మేలు అంటున్నారు నిపుణులు. (image credit - twitter - reuters)