Gold Price: బంగారం ధరలు పెరుగుతున్నాయా... తగ్గుతున్నాయా అనేది మనం వారమో, పది రోజులో కాకుండా... కొన్ని నెలలుగా ట్రెండ్ ఎలా ఉందో చూసుకోవాలి. దాన్ని బట్టీ నగలు కొనుక్కోవాలో, వద్దో డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే... తక్కువ ధర ఉన్నప్పుడు కొనుక్కుంటే... కనీసం ఒకటో, రెండు గ్రాములో ఎక్కువ బంగారం సొంతమవుతుంది. అదే ధర ఎక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటే... ఎక్కువ రేటుకి కొనుక్కున్నామనే బాధాకరమైన ఫీలింగ్ జీవితాంతం ఉంటుంది. కష్టపడి సంపాదించే సొమ్ము కదా... కాబట్టి... మనం దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తాం. మరి ఆ రకమైన మంచి విశ్లేషణ ఇప్పుడు చేద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Trend: గత 10 రోజుల్లో బంగారం ధరలు 3 రోజులు తగ్గాయి. 4 రోజులు పెరిగాయి. 3 రోజులు స్థిరంగా ఉన్నాయి. మరోలా ఆలోచిస్తే... గత 10 రోజుల్లో నగల బంగారం 10 గ్రాములు ధర రూ.540 తగ్గింది. కాబట్టి మనం నగలు కొనుక్కోవచ్చు అని ఫిక్స్ అయిపోవద్దు. గత ఏడాది కాలంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. గత సంవత్సరం ఆగస్ట్ 17న ఇదే 10 గ్రాముల నగల బంగారం ధర రూ.51,670 ఉంది. ఇప్పుడు రూ.44,010 ఉంది. అంటే... ఏడాది కాలంలో బంగారం ధర రూ.7,660 తగ్గింది. అంటే... ఇప్పుడు మనం గోల్డ్ నగలు కొనుక్కుంటే... తక్కువ ధరకు కొనుక్కున్నట్లే అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పుడే ఎందుకు... మరో నాల్రోజులు ఆగితే... మరింత ధర తగ్గుతుందేమో అనే ప్రశ్న రావచ్చు. నిజమే... తగ్గొచ్చు లేదా పెరగవచ్చు. గత వారం వరుసగా 4 రోజులు బంగారం ధర పెరిగింది. నిన్న స్థిరంగా ఉంది. సో... పెరుగుతున్న ట్రెండ్ నడుస్తోంది. దానికి తోడు... ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం మొదలైంది కదా... కాబట్టి... అంతర్జాతీయంగా బంగారంపై పెట్టుబడులు పెరిగి... ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి... ఇంకా ఆగితే... ధర పెరగొచ్చు. ఈ విధంగా సొంతంగా విశ్లేషించుకొని నగలు కొనుక్కోవడం వల్ల... సరైన టైమ్‌లో తక్కువ ధరకు కొనుక్కోగలం. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.120 పెరిగి... రూ.44,480కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,160 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.140 పెరిగి.. రూ.46,500కి చేరింది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.180 తగ్గి... రూ.45,980కి చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 17-8-2021: వెండి ధర నిన్న స్థిరంగా ఉంది. గత 10 రోజుల్లో ధర 6 సార్లు తగ్గగా... 2 సార్లు పెరిగింది. రెండుసార్లు స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.68.20 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.545.60 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.682 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,820 ఉండగా... కేజీ వెండి ధర... రూ.68,200 ఉంది. నిన్న కేజీ వెండి ధరలో మార్పు రాలేదు. వెండి నగలు కొనుక్కోవాలి అనుకునేవారికి ఇది సరైన టైమే. ఎందుకంటే... జూన్ 1న కేజీ వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.68,200 ఉంది. అంటే... ఈ రెండున్నర నెలల కాలంలో ధర రూ.8,600 తగ్గింది. ఐతే... ఆగస్ట్ 8 నుంచి వెండి ధర పెరుగుతోంది. మున్ముందు కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: స్టాక్ మార్కెట్లు నిన్న కళకళలాడాయి. గత వారం లాగే... మళ్లీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు బలపడితే.. నిఫ్టీ 34 పాయింట్లు బలపడింది. అంటే ఇన్వెస్టర్లకు దాదాపు రూ.లక్షన్నర కోట్ల లాభం వచ్చినట్లే. ఐతే... ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు లేవు. ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకం వల్ల త్వరలోనే ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి... చిన్న ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా అంచనాలు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ పరిస్థితులను కంటిన్యూగా గమనిస్తూ ఉండాలి. ఆసియా మార్కెట్లపై ఓ కన్నేసి ఉంచాలి. నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆ ప్రభావం ఇవాళ ఆసియా మార్కెట్లపై పడుతుంది. సో... ఇవాళ మన స్టాక్‌మార్కెట్ కూడా కొంత ప్రభావితం అయ్యే అవకాశాలు ఉండొచ్చు. అప్రమత్తతే అసలైన రక్ష అంటున్నారు నిపుణులు. (image credit - twitter - reuters)