Gold Price today: ఆగస్టు ప్రారంభంలో తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు... ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇవి మరింత పెరిగేలా ప్రపంచ అంశాలు కారణం అవుతున్నాయి. ప్రధానంగా ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడమే కాక... అధికారాన్ని కూడా చేజిక్కించుకోవడంతో... ప్రపంచ దేశాల్లో టెన్షన్ ఉంది. దీని ప్రభావం అంతర్జాతీయ వాణిజ్యంపై కొన్ని నెలలపాటూ ఉంటుంది. తాలిబన్లు తీసుకునే నిర్ణయాలు గల్ఫ్ దేశాలను ప్రభావితం చేస్తాయి. అదువల్ల చమురు ధరల్లో పెరుగుదలా, తగ్గుదలా వంటివి ఉంటాయి. ఈ అంశాలు ప్రపంచ వాణిజ్యాన్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. అందువల్ల ప్రపంచ ఇన్వెస్టర్లు సేఫ్ మోడ్‌గా బంగారంపై పెట్టుబడులు పెడతారు. అందువల్ల బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు రూ.41,100 ఉంది. ఆగస్ట్ 16 ఉదయం నాటికి అది రూ.2,910 పెరిగింది. ఇదే విధంగా... 24 క్యారెట్ల పెట్టుబడుల బంగారం 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉంటే... ఈ నాలుగున్నర నెలల్లో రూ.3,170 పెరిగింది. అంటే మార్చి 31 నుంచి బంగారంపై పెట్టుబడి పెట్టిన వారు లాభపడినట్లే. ఇకపైనా ధర పెరిగితే ఇంకా లాభపడతారు. మరి నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Rates 16-8-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,401 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,208 ఉంది. నిన్న 8 గ్రాముల ధర రూ.8 పెరిగింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,010 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.10 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,801 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.38,408 ఉంది. నిన్న 8 గ్రాముల బంగారం ధర రూ.8 పెరిగింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.48,010 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.10 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,360 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,160 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,360 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,160 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 16-8-2021: వెండి ధర నిన్న స్థిరంగా ఉంది. గత 10 రోజుల్లో 7 సార్లు తగ్గగా... 2 సార్లు పెరిగింది. ఒకసారి స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.68.20 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.545.60 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.682 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,820 ఉండగా... కేజీ వెండి ధర... రూ.68,200 ఉంది. నిన్న కేజీ వెండి ధరలో మార్పు రాలేదు. వెండి నగలు కొనుక్కోవాలి అనుకునేవారికి ఇది సరైన టైమే. ఎందుకంటే... జూన్ 1న కేజీ వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.68,200 ఉంది. అంటే... ఈ రెండున్నర నెలల కాలంలో ధర రూ.8,600 తగ్గింది. ఐతే... ఆగస్ట్ 8 నుంచి వెండి ధర పెరుగుతోంది. మున్ముందు కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: స్టాక్ మార్కెట్లతో ఇవాళ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆసియా మార్కెట్లు ఇవాళ భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే... భారత స్టా్క్ మార్కెట్లు కూడా నష్టాల్లోకి వెళ్తాయి. ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై పడే ప్రమాదం ఉంది. కాబట్టి... ఇన్వెస్టర్లు ఇవాళ జాగ్రత్తగా వ్యవహరించాలి. పెట్టుబడులు పెడితే... ఇవాళ నష్టపోయే ప్రమాదం రావచ్చు. మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో మొదటి గంట తర్వాత గానీ కచ్చితంగా తెలియదు. అప్పటివరకూ ఎదురుచూడాలే తప్ప... షేర్లు కొనడమో, అమ్మడమో చెయ్యవద్దని నిపుణులు అంటున్నారు. గంట తర్వాత... అప్ అండ్ డౌన్స్‌లో కదలికలు తగ్గుతాయనీ... అప్పుడు ట్రెండ్‌ని బట్టీ నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. (image credit - twitter - reuters)