Gold Price today: ఇన్నాళ్లూ విపరీతంగా ధర పెరుగుతూ వెళ్లిన బంగారం... ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. నిజానికి ఇప్పుడే కాదు... సంవత్సర కాలం నుంచి బంగారం ధర తగ్గుతూనే ఉంది. సంవత్సరం కిందట ఇదే తేదీన ఎవరైనా బంగారంపై పెట్టుబడి పెట్టి... ఇప్పుడు లాభం వచ్చిందో లేదో చూసుకుంటే... వాళ్లు నష్టపోయినట్లు అర్థం అవుతుంది. ఆ వివరాల్ని క్లియర్ లెక్కలతో సహా చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
గత సంవత్సరం ఆగస్ట్ 11న 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు రూ.53,140 ఉండగా... సంవత్సర కాలంలో అది రూ.9,790 తగ్గింది. అలాగే... 24 క్యారెట్ల ప్యూర్ పెట్టుబడుల గోల్డ్ 10 గ్రాములు గతేడాది ఆగస్ట్ 11న రూ.58,030 ఉండగా... సంవత్సర కాలంలో అది రూ.10,730 తగ్గింది. దీన్ని బట్టీ... సంవత్సర కాలంగా బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. నగలు కొనుక్కోవాలి అనుకునేవారికి ఇది మంచి వార్తే. సంవత్సరం కిందట కొనుక్కున్నవారితో పోల్చితే... ఇప్పుడు కొనుక్కునేవారు... దాదాపు రూ.10వేలు తక్కువ ధరకే కొనుక్కున్నట్లు లెక్క. ఇన్వెస్టర్లకు మాత్రం ఇది బాధాకరమైన విషయమే. వారి పెట్టుబడి నష్టపోయినట్లే. మరి నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Rates 10-8-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,335 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.34,680 ఉంది. నిన్న 8 గ్రాముల ధర రూ.392 తగ్గింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.43,350 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.490 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,730 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.37,840 ఉంది. నిన్న 8 గ్రాముల బంగారం ధర రూ.424 తగ్గింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.47,300 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.530 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,350 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,350 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,350 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,350 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,800 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.45,500 ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.45,750 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.45,280 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 10-8-2021: వెండి ధర నిన్న భారీగా పెరిగింది. గత 10 రోజుల్లో 6 సార్లు తగ్గగా... 3 సార్లు పెరిగింది. 1 సారి స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.68.70 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.549.60 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.687 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,870 ఉండగా... కేజీ వెండి ధర... రూ.68,700 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.3,700 పెరిగింది. ఆరు నెలల లెక్క చూస్తే... ఫిబ్రవరి 10న కేజీ వెండి ధర రూ.74,400 ఉంది. అప్పటికీ ఇప్పటికీ ధర రూ.5,700 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: స్టాక్ మార్కెట్లతో జాగ్రత్తగా ఉండాలి. గతవారం, నిన్న కూడా అవి లాభాల్లోకి వెళ్లాయి. అంటే... సడెన్గా ఏదో ఒక రోజు లాభాలను వెనక్కి తీసుకుంటారు. అలా తీసుకున్న రోజున... తీసుకోని వారు అలర్ట్ అవ్వకపోతే... అడ్డంగా నష్టపోతారు. నిన్న సెన్సెక్స్ 125 పాయింట్లు బలపడింది, నిఫ్టీ 20 పాయింట్లు బలపడింది. అంటే... ఇన్వెస్టర్ల సంపద రూ.లక్ష కోట్లకు పైగా పెరిగినట్లే. ఆ పెరిగిన సంపదను తీసేసుకోవడానికి వారు ఏ క్షణమైనా రెడీగా ఉంటారు. అంతర్జాతీయంగా ఏ కరోనా న్యూసో వస్తే, ఏ చమురు ధరలో పెరిగితే... అంతే... వెంటనే లాభాల స్వీకరణ జరిగిపోతుంది. కాబట్టి... చిన్న చిన్న షేర్లు కొనుక్కునే వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది అని నిపుణులు చెబుతున్నారు. (image credit - twitter - reuters)