1. బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నాలుగు రోజులు తగ్గిన బంగారం ధరలు మూడు రోజులుగా పెరుగుతున్నాయి. మార్చిలోనే బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.60,000 మార్క్‌కు చేరువకాగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్ రూ.55,000 మార్క్‌ను టచ్ చేసింది. వెండి రూ.77,500 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. మార్చి 9న 22 క్యారట్ గోల్డ్ ధర రూ.50,900 ఉండగా రెండు వారాల్లో రూ.4100 పెరిగింది. ఇక అదే రోజున 24 క్యారట్ గోల్డ్ ధర రూ.55,530 ఉండగా రూ.4470 పెరిగింది. ఇక మార్చి 10న కిలో వెండి ధర రూ.67,300 ఉండగా కిలో వెండిపై ఏకంగా రూ.10,200 పెరిగింది. మార్చి 18న బంగారం ధరలు ఆల్ టైమ్ హై ధరలకు చేరుకున్నాయి. మార్చి 18న 22 క్యారట్ బంగారం రూ.55,300 ధరకు, 24 క్యారట్ బంగారం రూ.60,320 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గితే, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ 2023 ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.24 శాతం అంటే రూ.144 పెరిగి రూ.59,460 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మే ఫ్యూచర్స్ 0.27 శాతం అంటే రూ.193 పెరిగి రూ.71,967 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర కాస్త తగ్గింది. ఔన్స్ బంగారం ధర మళ్లీ 2000 డాలర్లకు చేరువవుతోంది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,980.10 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర కాస్త తగ్గింది. ఔన్స్ సిల్వర్ ధర 24.00 డాలర్లకు చేరువైంది. ప్రస్తుతం 23.99 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)