1. బంగారం... భారతీయులకు పెట్టుబడి మాత్రమే కాదు ఓ సెంటిమెంట్ కూడా. నగలు కొన్నా, బాండ్ కొన్నా బంగారాన్ని సెంటిమెంట్‌తో చూస్తుంటారు. అందుకే మార్కెట్లో బంగారానికి ఎప్పుడూ డిమాండే. 2019 సంవత్సరంలో బంగారంపై పెట్టుబడి పెట్టినవారికి మంచి లాభాలే వచ్చాయి. ఏకంగా 23 శాతం లాభాలను పొందారు ఇన్వెస్టర్లు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం సెకండరీ మార్కెట్లో SGBJAN26 సిరీస్ గోల్డ్ బాండ్ 1 గ్రాము ధర రూ.3695 ఉంది. అదే స్వచ్ఛమైన బంగారం 1 గ్రాము కొనాలంటే రూ.4005 చెల్లించాలి. అదే సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్ కొంటే 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. SGBJAN26 సిరీస్ గోల్డ్ బాండ్ 2026 జనవరిలో మెచ్యూర్ అవుతుంది. ఇలా వేర్వేరు కాలవ్యవధులతో బోల్డ్ బాండ్స్ సెకండరీ మార్కెట్లో దొరుకుతుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
10. సావరిన్ గోల్డ్ బాండ్స్ వల్ల మంచి లాభాలు ఉన్నట్టు అయితే ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో ఎందుకు లభిస్తున్నాయన్న అనుమానం మీకు రావచ్చు. సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్ముతున్నవాళ్లు ఇప్పుడు ఇస్తున్న ధర కంటే తక్కువ ధరకే బాండ్స్ కొని ఉంటారు. వారికి ఇప్పుడు అమ్మినా లాభమే. (ప్రతీకాత్మక చిత్రం)