1. గత రెండు నెలలుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండు నెలల్లో సుమారు రూ.5,000 వరకు బంగారం ధర పెరిగింది. వెండి అయితే ఏకంగా కిలోపై రూ.14,000 పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ ముగిసిన తర్వాత కూడా గోల్డ్, సిల్వర్ రేట్స్ పెరుగుతున్నాయి. ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. (image: Reliance Jewels)
3. హైదరాబాద్లో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.270 పెరగడంతో రూ.54,930 నుంచి రూ.55,200 ధరకు చేరుకుంది. హైదరాబాద్లో బంగారం ధరలు పెరిగితే, వెండి ధర స్వల్పంగా తగ్గింది. శనివారం కిలో వెండిపై రూ.200 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.74,300. రెండు నెలల్లో కిలో వెండి ధర సుమారు రూ.14,000 పెరిగింది. (image: Reliance Jewels)
4. నవంబర్ 4 నుంచి బంగారం ధరలు భారీగా పెరిగాయి. నవంబర్ 4న 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా ప్రస్తుతం రూ.50,600 ధరకు చేరుకుంది. అప్పటి నుంచి ఇవాళ్టి వరకు రూ.4,500 పెరిగింది. ఇక అదే రోజున 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.50,290 ఉండగా ప్రస్తుతం రూ.55,200 ధరకు చేరుకుంది. అప్పటి నుంచి రూ.4,710 పెరిగింది. (image: Reliance Jewels)