దేశీ మార్కెట్లో బంగారం ధరలపై ప్రభావం చూపే గ్లోబల్ మార్కెట్లోని గోల్డ్ రేట్ల విషయానికి వస్తే.. ఈ రోజు గ్లోబల్ మార్కెట్లో రేట్లు తగ్గాయి. బంగారం ధర కొంత మేర క్షీణించింది. 0.28 శాతం తగ్గింది. ఔన్స్‌కు 1818 డాలర్ల వద్ద కదలాడుతోంది. వెండి రేటు అయితే ఔన్స్‌కు 0.07 శాతం తగ్గుదలతో 24.2 డాలర్లకు దిగి వచ్చింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్లో గోల్డ్ రేటు పైకి చేరడం గమనార్హం. కాగా వచ్చే ఏడాది బంగారం ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.