బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తులం ధర 50 వేలు దాటి పరుగులు తీస్తోంది. గురువారం కూడా బంగారం ధరలు పెరిగాయే తప్ప తగ్గుముఖం పట్టలేదు. బుధవారంతో పోల్చుకుంటే గురువారం(నవంబర్ 18) నాడు బంగారం ధర తులంపై మరో 110 రూపాయలు పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారు ఆభరణాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది.
ఇవాల్టి బంగారం ధరలను ఒక్కసారి పరిశీలిస్తే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో తులం బంగారం ధర ఇప్పటికే 50 వేల రూపాయలు దాటిపోయింది. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను ఒక్కసారి పరిశీలిస్తే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం తులం ధర 50,070 రూపాయలుగా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,900గా ఉంది.
ఇక.. విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో కూడా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,070 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర రూ.45,900 వద్ద నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీలో గురువారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,420 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.48,250గా ఉంది. ఢిల్లీతో పోల్చితే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పసిడి ధర కాస్తంత తక్కుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,470గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,470గా ఉంది. విశేషం ఏంటంటే.. ఒక్క ముంబై, నాగ్ పూర్ నగరాల్లోనే 24 క్యారెట్ల బంగారం తులం ధర 50 వేల లోపు ఉంది. మిగిలిన అన్ని ప్రధాన నగరాల్లో తులం బంగారం ధర 50 వేల పైమాటే. చెన్నైలో కూడా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం తులం రూ.50,450 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,250గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,070గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,900గా ఉంది. ఢిల్లీ తర్వాత కోల్కత్తాలో పసిడి ధర అత్యధికంగా ఉండటం గమనార్హం. కోల్కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,450 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,750 పలుకుతోంది. మైసూరు, మంగుళూరు, కేరళలో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.50,070 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల బంగారం తులం ధర 45,900 రూపాయలు పలుకుతోంది.