కాగా ఈ నెలలో బంగారం ధరలు ఇంకా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. 1840 డాలర్ల స్థాయికి చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మన దేశంలో కూడా పసిడి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎంసీఎక్స్ మార్కెట్లో రూ. 54 వేలు దాటొచ్చని భావిస్తున్నారు. అంటే ఇక రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు ఇంకా పైకి చేరొచ్చు. పెళ్లిళ్ల సీజన్లో ధరలు పెరగడం వల్ల చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడనుంది.