2. మంగళవారం హైదరాబాద్లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.600 తగ్గి రూ.46,000 ధరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.660 తగ్గి రూ.50,180 ధరకు చేరుకుంది. గత 4 రోజుల్లో స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై రూ.1,100 తగ్గగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర 10 గ్రాములపై రూ.1,200 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. అక్టోబర్ మొదటి వారం వరకు బంగారం ధరలు బాగా పెరిగాయి. అక్టోబర్ 8 నాటి ధరలతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ రూ.1,850 తక్కువకు, 24 క్యారెట్ గోల్డ్ రూ.2,020 తక్కువకు లభిస్తోంది. గత నెల కన్నా బంగారం ధర భారీగా తగ్గడంతో పసిడి కొనాలనుకునేవారికి మంచి అవకాశం లభిస్తోంది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండిపై రూ.700 పెరిగి రూ.63,000 నుంచి రూ.63,700 కి చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనం అయితే మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.55 శాతం అంటే రూ.278 పెరిగి రూ.50,600 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 2.92 శాతం అంటే రూ.1,686 పెరిగి రూ.59,365 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,653.70 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 20 డాలర్లు దాటింది. వెండి 20.04 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్లో మరో 12 నెలల్లో ఔన్సు బంగారం ధర 1,830 డాలర్లకు చేరవచ్చని ఇటీవల నిపుణులు వెల్లడించిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)