1. ధంతేరాస్, దీపావళి సీజన్లో బంగారం ధరలు (Gold Prices) పెరిగిన సంగతి తెలిసిందే. ధంతేరాస్ ముందు నుంచే గోల్డ్ రేట్స్ పెరగడం ప్రారంభమైంది. గత వారాంతం వరకు గోల్డ్ రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు బంగారం ధరలు మళ్లీ పతనం అవుతున్నాయి. గత మూడు రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతుండటం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
2. అక్టోబర్ 29న స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై రూ.380 తగ్గగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.350 తగ్గింది. ఇక సోమవారం 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.160 తగ్గగా, 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.150 తగ్గింది. ఈ మూడు రోజుల్లో బంగారం ధర రూ.500 పైనే తగ్గడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
3. సోమవారం హైదరాబాద్లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.46,600 కాగా, 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.50,840. ఇక వెండి ధరలు ఊగిసలాడుతున్నాయి. గతవారం వెండి ధర కాస్త పెరిగింది. గత రెండు రోజులుగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.63,000. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,643.50 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 19.24 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతున్నా మరో 12 నెలల్లో ఔన్సు బంగారం ధర 1,830 డాలర్లకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)