హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరల ఈ వారం తగ్గాయి. మార్చి 19 నుంచి వారం రోజులుగా చూస్తే.. పసిడి రేటు పడిపోయింది. వారం ఆరంభంలో పసిడి రేటు రూ. 60,320 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు గోల్డ్ రేటు రూ. 59,840కు తగ్గింది. అంటే పసిడి రేటు రూ. 480 మేర దిగి వచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరకు ఇది వర్తిస్తుంది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే.. బంగారం ధరలు ప్రస్తుతం ఔన్స్‌కు 1981 డాలర్ల వద్ద ఉంది. వెండి రేటు అయితే ఔన్స్‌కు 23.3 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్ బంగారం ధరల ట్రెండ్ మన దేశంలో పసిడి రేట్లను నిర్ణయిస్తాయని గుర్తించుకోవాలి. అందువల్ల పసిడి ప్రేమికులు ఈ విషయాన్ని గమనిస్తూ ఉండాలి. ట్రెండ్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి.