హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలను గమనిస్తే.. ఫిబ్రవరి 1న బంగారం ధర పది గ్రాములకు రూ. 57,820 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు పసిడి రేటు రూ. 56,120కు క్షీణించింది. అంటే బంగారం ధర గత నెలలో ఏకంగా రూ. 1700 పతనమైందని చెప్పుకోవచ్చు. ఇది 24 క్యారెట్ల బంగారానికి వర్తిస్తుంది.