Gold Prices Today: ఇండియాలో కరోనా పెరిగితే... బంగారం ధరలు పెరగడం సహజం... ఇప్పుడు కరోనా తగ్గుతోంది కాబట్టి... బంగారం ధరలు కూడా తగ్గడం మొదలైంది. వరుసగా 8 రోజులుగా పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరల్లో పెరుగదల మొదలైంది. అది జూన్ 11 వరకూ కనిపించింది. అప్పటివరకూ బంగారంపై వచ్చిన రిటర్నులను వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారు ఇన్వెస్టర్లు. ఇది 8 రోజులుగా కంటిన్యూ అవుతోంది. ఇకపైనా ఇది కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
జూన్ 11న 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు ధర రూ.46,100 ఉంది. ఇప్పుడు రూ.44,000 ఉంది. అంటే... 8 రోజుల్లో ధర రూ.2,100 తగ్గింది. అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు జూన్ 11న రూ.50,300 ఉండగా... ఇప్పుడు రూ.48,000 ఉంది. అంటే... 8 రోజుల్లో ధర రూ.2,300 తగ్గింది. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Prices 20-6-2021: గత 10 రోజుల్లో బంగారం ధర 8 సార్లు తగ్గగా... 1 సారి మాత్రమే పెరిగింది. 1 సారి స్థిరంగా ఉంది. నిన్న భారీగా తగ్గింది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,400 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,200 ఉంది. నిన్న తులం ధర రూ.200 తగ్గింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,000 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.250 తగ్గింది. పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,800 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.38,400 ఉంది. నిన్న తులం ధర రూ.216 తగ్గింది. ఇక 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.48,000 ఉంది. నిన్న ధర రూ.270 తగ్గింది. హైదరాబాద్, సికింద్రాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్లో ధరలు ఒకేలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 20-6-2021: వెండి ధర గత 10 రోజుల్లో 5 సార్లు తగ్గగా... 2 సార్లు పెరిగింది. 3 సార్లు స్థిరంగా ఉంది. నిన్న భారీగా తగ్గింది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.73.10 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.584.80 ఉంది. నిన్న ధర రూ.7.20 తగ్గింది. అదే 10 గ్రాములు కావాలంటే... ధర రూ.731 ఉంది. నిన్న ధర రూ.9 తగ్గింది. 100 గ్రాములు ధర రూ.7,310 ఉండగా... కేజీ వెండి ధర... రూ.73,100 ఉంది. నిన్న కేజీ రూ.900 తగ్గగా... గత 6 నెలల్లో అంటే... డిసెంబర్ 20న వెండి ధర కేజీ రూ.71,600 ఉంది. ఇప్పుడు రూ.73,100 ఉంది. 6 నెలల్లో వెండి ధర కేజీకి రూ.1,500 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లలో జోరు: బంగారంపై పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న ఇన్వెస్టర్లు వాటి ద్వారా వ్యాపారాలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే కొంత డబ్బును తిరిగి స్టాక్ మార్కెట్లలో పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు 2 కారణాలు ఉన్నాయి. గత వారం స్టాక్ మార్కెట్లు నష్టాలు చూశాయి. చాలా ఈక్విటీ షేర్ల ధరలు తగ్గాయి. కాబట్టి... ఈ వారం ఆ షేర్లను కొనేందుకు పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉంది. అలాగే... విదేశాల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FII), స్వదేశం నుంచి స్వదేశీ సంస్థాగత పెట్టుబడులు (DII)లు బాగా పెరుగుతున్నాయి. అందువల్ల సామాన్య ప్రజలు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు ఈ వారం ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)