Gold Prices Today: బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. ఐతే... ఈ తగ్గుదల మరీ ఎక్కువగా ఏమీ లేదు. నిన్న జస్ట్ రూ.10 మాత్రమే తగ్గాయి. ఆదివారం బులియన్ మార్కెట్ ఉండదు కాబట్టి... బంగారం ధరల్లో పెద్దగా మార్పులు ఉండవు. సోమవారం నుంచి మళ్లీ మార్కెట్లు కళకళలాడుతాయి. ఐతే... ఏప్రిల్ 1 నుంచి ఇండియాలో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వాటిని విశ్లేషిస్తే... మార్చి 31న 22 క్యారెట్ల నగల తయారీకి వాడే బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడు (ఆదివారం నాటికి)... రూ.45,740 ఉంది. 74 రోజుల్లో ధర రూ.4,640 పెరిగింది. అలాగే.. 24 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా... ఇప్పుడు రూ.49,890 ఉంది. అంటే 74 రోజుల్లో ధర రూ.5,050 పెరిగింది. నేటి ఉదయం రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Prices 14-6-2021: గత 10 రోజుల్లో బంగారం ధర 4 సార్లు పెరగగా... 5 సార్లు తగ్గింది. 1 సారి స్థిరంగా ఉంది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,574 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.36,592 ఉంది. నిన్న తులం ధర రూ.10 తగ్గింది. ఇక 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.45,740 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.10 తగ్గింది. పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,989 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.39,912 ఉంది. నిన్న తులం ధర రూ.10 తగ్గింది. ఇక 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.49,890 ఉంది. నిన్న ధర రూ.10 తగ్గింది. హైదరాబాద్, సికింద్రాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 14-6-2021: వెండి ధర గత 10 రోజుల్లో 3 సార్లు పెరగగా... 3 సార్లు తగ్గింది. 4 సార్లు స్థిరంగా ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.77.30 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.618.40 ఉంది. నిన్న ధర స్థిరంగా ఉంది. అదే 10 గ్రాములు కావాలంటే... ధర రూ.773 ఉంది. నిన్న ధర స్థిరంగా ఉంది. 100 గ్రాములు ధర రూ.7,730 ఉండగా... కేజీ వెండి ధర... రూ.77,300 ఉంది. గత 6 నెలల్లో వెండి ధర రూ.1,300 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
మళ్లీ సాధారణ పరిస్థితులు: దేశంలో కరోనా తగ్గుతోంది. రాష్ట్రాల్లో లాక్డౌన్లు ఎత్తివేస్తున్నారు. అందువల్ల బంగారం నగల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అటు స్టాక్ మార్కెట్లు కూడా జోరందుకున్నాయి. విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు మార్కెట్లలోకి వస్తున్నాయి. ఇదే సమయంలో... బిట్ కాయిన్ బలహీన పడుతోంది. కాబట్టి... ఇండియాలో బంగారం ధరలు పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల మాట. డాలర్‌తో పోల్చితో రూపాయి విలువ తగ్గుతోంది. కాబట్టి... విదేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారానికి ఎక్కువ చెల్లిస్తారు. కాబట్టి ఈ వారం బంగారం ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. కచ్చితంగా పెరుగుతాయా అన్నది ఎవరూ చెప్పలేరు. (ప్రతీకాత్మక చిత్రం)