22 carat gold rate: సామాన్య ప్రజలు ఎక్కువగా నగల రూపంలోనే బంగారాన్ని కొంటారు. ఆ ఆభరణాల తయారీకి 22 క్యారట్ల బంగారాన్ని వాడుతారు. హైదరాబాద్ మార్కెట్లో ఈ బంగారం 10 గ్రాముల ధర రూ.52,750గా ఉంది. నిన్నటితో పోల్చితే ధరలో మార్పులేదు. ఒక్క గ్రాము 22 క్యారట్ల బంగారం రేటు రూ.5,275 పలుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
24 carat gold rate: స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పుడు చాలా మంది బంగారంలో పెట్టుబడులు పెడుతుంటారు. పెట్టుబడులకు 24 క్యారట్ల బంగారాన్ని వినియోగిస్తారు. ఈ స్వచ్ఛమైన బంగారం తులం రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ.57,550గా ఉంది. నిన్నటితో పోల్చితే ధరలో మార్పులేదు. ఒక్క గ్రాము స్వచ్ఛమైన బంగారం రూ.5,755కి లభిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
బంగారం ధరల్లో హెచ్చు తగ్గులకు చాలా కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే వీటి ధరలు ప్రతి రోజూ మారుతుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)