అలాగే వండి విషయానికి వస్తే.. సిల్వర్ రేటు పడిపోయింది. వరుసగా రెండో రోజు కూడా వెండి ధర తగ్గుతూనే వచ్చింది. దీంతో వెండి ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. వెండి ధర ఈరోజు రూ. 400 పడిపోయింది. కేజీకి రూ. 74,200కు ఎగసింది. నిన్న కూడా వెండి రేటు రూ. 400 పతనమైంది. అంటే రోజుల వ్యవధిలో వెండి రేటు రూ. 800 దిగి వచ్చింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే.. బంగారం ధరలు బంగారం, వెండి ధరలు కొంత మేర తగ్గాయి. అయినా కూడా ఇంకా గరిష్ట స్థాయిల్లోనే కదలాడుతూ వస్తున్నాయి. బంగారం ధర ఔన్స్‌కు 1928 డాలర్లకు క్షీణించింది. వెండి రేటు ఔన్స్‌కు 23.72 డాలర్లకు తగ్గింది. గ్లోబల్ మార్కెట్లో రేట్లు దేశీ మార్కెట్లో గోల్డ్ రేట్లపై ప్రభావం చూపుతాయనే విషయం మనకు తెలిసిందే.