మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. పసిడి రేటు ఏకంగా 3 శాతానికి పైగా పెరిగింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర 3.68 శాతం మేర పెరిగింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1993 డాలర్ల పైకి కదిలింది. అలాగే వెండి రేటు 4.88 శాతం ర్యాలీ చేసింది. దీంతో వెండి ధర ఔన్స్‌కు 22.75 డాలర్లకు చేరింది.
కాగా బంగారం ధరలు రానున్న కాలంలో మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. పసిడి గ్రాములకు రూ. 65 వేలకు చేరొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా డాలర్ బలహీనపడటం, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం వంటి పలు అంశాలు బంగారం ధర పరుగుకు దోహదపడుతున్నాయని తెలియజేస్తున్నారు. దీంతో బంగారం కొనే వారిపై ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పుకోవచ్చు.