హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు దేశరాజధాని న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళలో ఒకే ధరలకు బంగారం లభిస్తోంది. ఈ ప్రాంతాల్లో 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,300గా ఉంది. చెన్నైలో రూ.47,920, పుణెలో రూ.47,350 జైపూర్,లక్నోల్లో రూ.47,450కి తగ్గిపోయింది.(ప్రతీకాత్మక చిత్రం)
24 Carats Gold: ఇది పెట్టుబడులకు వినియోగించే బంగారం. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటే ఎక్కువ మంది బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,600కి పడిపోయింది.. నిన్నటితో పోల్చితే రూ.330 తగ్గింది. ఒక్క గ్రాము స్వచ్ఛమైన బంగారం హైదరాబాద్‌లో రూ.5,160కి లభ్యమవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
వెండి ధరలు చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడలో ఒకేలా ఉన్నాయి. ఇక్కడ తులం వెండి ధర రూ.723 గా ఉంది. ముంబై, న్యూఢిల్లీ, జైపూర్, లక్నోల్లో రూ.679కే అందుబాటులో ఉంది. గత 10 రోజుల్లో వెండి ధరలు ఐదు సార్లు తగ్గాయి. నాలుగు సార్లు పెరిగాయి. ఒకరోజు పాటు స్థిరంగా ఉన్నాయి. ప్రతీకాత్మక చిత్రం)
బంగారం ధరలు ఎప్పుడు ఒకేలా ఉండవు. నిత్యం మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)