24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని పెట్టుబడుల్లో వినియోగిస్తారు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో అందరూ బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎగబడుతున్నారు. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో 51,550కి చేరింది. నిన్నటితో పోల్చితే రూ.1,370 పెరిగింది. తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.5,155 పలుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, కేరళలో బంగారం ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.47,250గా ఉంది. చెన్నైలో రూ.49,510, పుణెలో రూ.47,300, జైపూర్‌లో రూ.47,300, లక్నోలో 47,320కి తులం బంగారం లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలలో పెరుగుదల, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, వివిధ జువెలరీ మార్కెట్లలో డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతుండడంతో అందరూ బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)