Gold Price: బంగారం ధరలు 5 రోజులుగా తగ్గుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థ మెరుగవ్వడమే. కార్యకలాపాలు పుంజుకోవడంతో... బంగారంపై పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకుంటున్నారు. ఆ డబ్బుతో వ్యాపారాలు చేస్తున్నారు లేదా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. అందుకే నెల నుంచి స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. బంగారు నగలు కొనుక్కోవడానికి ఇది మంచి తరుణం అంటున్న బులియన్ మార్కెట్ విశ్లేషకులు... మరికొంతకాలం వేచి చూడవచ్చు అని అంటున్నారు. మున్ముందు బంగారం ధరలు మరింత తగ్గవచ్చనీ, లేదా పెరగవచ్చని అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Trend: ఆగస్ట్ 12 నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఆ రకంగా చూస్తే ఈ 23 రోజుల్లో 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు... రూ.850 పెరిగింది. ఈ సంవత్సరం లెక్క చూస్తే... మార్చి 31న బంగారం ధర అతి తక్కువగా ఉంది. ఆ రోజున 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడేమో... రూ.44,200 ఉంది. అంటే 156 రోజుల్లో ధర రూ.3,100 పెరిగింది. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Rates 4-9-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,420 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,360 ఉంది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,200 ఉంది. నిన్న 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా ఉంది. 5 రోజుల్లో ఇది రూ.360 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,200 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,200 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,200 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,200 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,510 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,350 ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,650 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,200 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 4-9-2021: వెండి ధర నిన్న కొద్దిగా తగ్గింది. ఆగస్ట్ 1 నుంచి చూస్తే 34 రోజుల్లో వెండి ధర రూ.5,200 తగ్గింది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.67.80 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.542.40 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.678 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,780 ఉండగా... కేజీ వెండి ధర... రూ.67,800 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.600 తగ్గింది. మొన్న రూ.300 తగ్గింది. మార్చి 31న కేజీ వెండి ధర రూ.67,300 ఉంది. ఇప్పుడు రూ.67,800 ఉంది. అంటే... ఈ 156 రోజుల్లో వెండి ధర రూ.500 పెరిగింది. ఐతే... జూన్ 1న కేజీ వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.67,800 ఉంది. అంటే... ఈ 95 రోజుల కాలంలో ధర రూ.9,000 తగ్గింది. అందువల్ల ప్రస్తుతం వెండి ధర తక్కువగానే ఉంది అనుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు ఓవైపు ఆనందాన్నీ, మరోవైపు టెన్షన్నీ కలిగిస్తున్నాయి. దాదాపు నెల నుంచి మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్తున్నాయి. సరికొత్త ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తున్నాయి. నిన్న సెన్సెక్స్ 277 పాయింట్లు బలపడితే... నిఫ్టీ 89 పాయింట్లు లాభపడింది. దీని వల్ల చిన్న ఇన్వెస్టర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల ప్రకారం... ఈ ట్రెండ్ మరికొన్నాళ్లు ఉంటుందట. ఐతే... లాభాల స్వీకరణ జరిగేటప్పుడు మాత్రం చిన్న చిన్న షేర్లు కొనేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. (image credit - twitter - reuters)