హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, కేరళలో బంగారం ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.46,850గా ఉంది. చెన్నైలో రూ.48,010, పుణెలో రూ.46,900, జైపూర్లో రూ.46,880, లక్నోలో 46,950కి తులం బంగారం లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో అందరూ బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపారు. డిమాండ్ పెరగడంతో ధర పెరిగింది. ఐతే ఉక్రెయిన్పై రష్యా పూర్తి ఆధిపత్యం చెలాయించి.. వార్ వన్ సైడ్ కావడంతో.. యుద్దం ముగుస్తుందన్న సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలో మళ్లీ స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో.. బంగారంపై పెట్టుబడులు తగ్గి.. ధరలు దిగొస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)