Gold Jewellery demand: ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పడిపోతోంది. ఐదు రోజులుగా బంగారం ధరలు పాతాళం లోకి వెళ్లిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే... ఆగస్ట్ 7 నుంచి బంగారం ధరలు పతనం వైపు సాగుతున్నాయి. దీపావళి తర్వాత ఈ పతనం మరింత పెరిగింది. ఇదే సమయంలో... ఈ సంవత్సరం బంగారు నగల కొనుగోళ్లు కూడా తగ్గాయి. ఇందుకు ప్రధాన కారణం కరోనా వైరస్ అనుకోవచ్చు. ఎప్పుడైతే కరోనా ఇండియాలోకి వచ్చిందో... ప్రజల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు గల్లంతయ్యాయి. దాంతో... చేతిలో డబ్బు లేక ప్రజలు బంగారం కొనుగోళ్లను తగ్గించుకున్నారు. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా (Icra) ప్రకారం... ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ బంగారు నగల కొనుగోళ్లు అత్యంత దారుణంగా పడిపోయాయి. ఐతే... ఇప్పుడు లాక్ డౌన్ నిబంధనలను తొలగించారు కాబట్టి అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి నాటికి బంగారం కొనుగోళ్లు తిరిగి పెరిగే అవకాశం ఉన్నట్లు ఇక్రా అంచనా వేసింది. (Symbolic Image)
ఇప్పటివరకూ ఈ ఆర్థిక సంవత్సరంలో... బంగారు నగల కొనుగోళ్లు 35 శాతం తగ్గాయి. ఇందుకు కరోనా కారణంతోపాటూ... అంతర్జాతీయంగా బంగారంలో పెట్టుబడులు పెరగడంతో... బంగారం ధర 12 శాతం పెరగడం కూడా కారణమైంది. ధర ఎక్కువగా ఉండటంతో... ప్రజలు గోల్డ్ వైపు చూడటం మానేశారు. ఇప్పుడు రెండున్నర నెలలుగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. మున్ముందు ఇవి ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రజలు గోల్డ్ జువెలరీ కొనేందుకు ఆసక్తి చూపించే అవకాశాలున్నాయి. (Symbolic Image)
వ్యాక్సిన్ వస్తే చాలు: అంతర్జాతీయంగా కరోనా వైరస్‌కి దాదాపు 10 పవర్ఫుల్ వ్యాక్సిన్లు రెడీ అవుతున్నాయి. అన్నీ మూడో దశ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఇండియాలో 3 వ్యాక్సిన్లు రాబోతున్నాయి. ఈ పరిణామాలతో... అంతర్జాతీయంగా ఇతర కరెన్సీలకు, స్టాక్ మార్కెట్లకూ ఊపు వస్తుంది. దాంతో... ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను తగ్గించేసుకొని... కరెన్సీ, స్టాక్ మార్కెట్లు వంటి వాటిపై పెడతారు. ఇప్పటికే ఇది జరుగుతోంది. అందుకే బంగారం ధర పడిపోతుంటే... స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. అందువల్ల ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు మరింత తగ్గి... నగల కొనుగోళ్లు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. (Symbolic Image)
వేచి చూస్తున్న ప్రజలు: దీపావళి, ధంతేరస్ సమయంలో... గోల్డ్ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. అందువల్ల తప్పనిసరి అయిన వారు, పెళ్లిళ్లు ఉన్నవారు మాత్రమే అప్పుడు నగలు కొనుక్కున్నారు. మిగతా వారు... ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 7 నుంచి ఇప్పటి వరకూ బంగారం ధరలు రూ.10వేల దాకా తగ్గాయి. ఇవి ఇంకా తగ్గే అవకాశాలు ఉండటంతో... అప్పుడే నగలు కొనకుండా ఎదురుచూస్తున్నారు ప్రజలు. ధరలు బాగా తగ్గి... మళ్లీ పెరిగే పరిస్థితికి వస్తున్నప్పుడు కొనుక్కుందామని ఎదురుచూస్తున్నారు. అందుకు కనీసం 2 నుంచి 3 నెలలు పట్టొచ్చనే అంచనా ఉంది. (Symbolic Image)
నేటి బంగారం ధరలు (29-11-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,000 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.450 తగ్గింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.36,000 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.360 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,500 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.49,090 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.490 తగ్గింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.39,272 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.392 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,909 ఉంది.
వ్యాక్సిన్ల ట్రయల్స్ పూర్తై తయారీ మొదలవ్వగానే... బంగారం ధరలు బాగా పడిపోయే ఛాన్స్ ఉంటుందంటున్నారు విశ్లేషకులు. ఇక పంపిణీ కూడా మొదలుపెడితే... అప్పుడు కరోనా పని అయిపోయనట్లే కాబట్టి... ఇక బంగారం నుంచి పెట్టుబడులు ఇతర మార్గాల్లోకి వెళ్లిపోయి... పసిడి ధరలు పాతాళంలోకి వెళ్తాయనే అంచనా ఉంది. "ఉందిలే మంచికాలం ముందుముందుగా" అనే విధానం ఇక్కడ కనిపిస్తోంది. (Symbolic Image)