Gold Price: వినాయకచవితి వచ్చేస్తోంది. నెక్ట్స్ దసరా, దీపావళి, ధంతేరస్ ఇలా చాలా పండుగలు ఉన్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. ఈ సెంటిమెంట్ కారణంగా... ఇండియాలో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఆగస్ట్ నెల శాలరీ రాగానే... ఇంటి బడ్జెట్ లెక్కలన్నీ పోగా.. దాచిన కొంత డబ్బుకి శాలరీలో కొంత కలిపి... నగలు కొనుక్కుంటున్నారు ప్రజలు. దాంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. తాజా రేట్లు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Rates 5-9-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,450 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,600 ఉంది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,500 ఉంది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగింది. 6 రోజుల్లో బంగారం ధర రూ.60 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,500 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,500 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,500 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,500 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,960 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,650 ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.47,000 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,400 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 5-9-2021: వెండి ధర నిన్న భారీగా పెరిగింది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.69.60 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.556.80 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.696 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,960 ఉండగా... కేజీ వెండి ధర... రూ.69,600 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.1800 పెరిగింది. మార్చి 31న కేజీ వెండి ధర రూ.67,300 ఉంది. ఇప్పుడు రూ.69,600 ఉంది. అంటే... ఈ 157 రోజుల్లో వెండి ధర రూ.2300 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: స్టాక్ మార్కెట్లతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. స్టాక్ బ్రోకర్ల మాట నమ్మి... ఊరూ పేరూ తెలియని కంపెనీల్లో వాటాలు కొనవద్దని అంటున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్ మార్కెట్ విశ్లేషకుడైన వారన్ బఫెట్ చెప్పినట్లు... పనితీరు సరిగా ఉన్న కంపెనీల వాటాలే కొనుక్కోమంటున్నారు. ఆ కంపెనీ ఉత్పత్తులు... నిత్యవసరాలకు సంబంధించినవైతే.. ఆ కంపెనీకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. అలాగే... లాభాలు తక్కువగా వచ్చినా... బ్రాండెడ్ కంపెనీల షేర్లు కొనుక్కోవడమే మంచిదంటున్నారు. అప్పుడు రిస్క్ తక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. (image credit - twitter - reuters)