Gold Trend: ఆగస్ట్ 12 నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. నిన్న తగ్గాయి. మొత్తంగా చూస్తే ఈ 19 రోజుల్లో 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు... రూ.1,100 పెరిగింది. ఈ సంవత్సరం లెక్క చూస్తే... మార్చి 31న బంగారం ధర అతి తక్కువగా ఉంది. ఆ రోజున 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడేమో... రూ.44,450 ఉంది. అంటే 152 రోజుల్లో ధర రూ.3,350 పెరిగింది. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,450 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,450 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,450 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,450 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,880 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,600 ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,850 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,500 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 31-8-2021: వెండి ధర నిన్న కొద్దిగా తగ్గింది. గత 10 రోజుల్లో వెండి ధర రూ.1,400 పెరిగింది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.68.40 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.547.20 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.684 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,840 ఉండగా... కేజీ వెండి ధర... రూ.68,400 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.300 తగ్గింది. మార్చి 31న కేజీ వెండి ధర రూ.67,300 ఉంది. ఇప్పుడు రూ.68,400 ఉంది. అంటే... ఈ 152 రోజుల్లో వెండి ధర రూ.1,100 పెరిగింది. ఐతే... జూన్ 1న కేజీ వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.68,400 ఉంది. అంటే... ఈ 91 రోజుల కాలంలో ధర రూ.8,400 తగ్గింది. అందువల్ల ప్రస్తుతం వెండి ధర తక్కువగానే ఉంది అనుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: ఆగస్ట్ నెలంతా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. నిన్న సరికొత్త రికార్డులు నమోదుచేశాయి. సెన్సెక్స్ ఏకంగా 765 పాయింట్లు బలపడగా నిఫ్టీ 225 పాయింట్లు లాభపడింది. అంటే నిన్న ఒక్క రోజే ఇన్వెస్టర్లకు 7న్నర లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి అనుకోవచ్చు. అఫ్కోర్స్ నష్టాలు వస్తే కూడా డబ్బు పోతుంది. అంతా గేమ్ లాగా సాగిపోతుంది. ప్రధానంగా విదేశీ పెట్టుబడులు బాగా వస్తున్నాయి. ఇక కరోనా తగ్గిపోతుంది అనే భావన కలుగుతోంది. పైగా చైనా కంటే ఇండియా బాగా డెవలప్ కాగలదు అనే నమ్మకం ఇన్వెస్టర్లకు కలుగుతోంది. అందువల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FII), స్వదేశీ సంస్థాగత పెట్టుబడులు (DII)లు బాగా పెరుగుతున్నాయి. ఐతే... ఏదో ఒక రోజున ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపిస్తారు. ఆ రోజున మాత్రం మార్కెట్లు భారీగా నష్టాల్లోకి జారుకునే ప్రమాదం ఉంటుంది. ఎక్కువగా శుక్రవారం ఇలా జరుగుతూ ఉంటుంది. (image credit - twitter - reuters)