Gold Price: ప్రపంచ కరోనాకీ బంగారానికీ సంబంధం ఉంటోంది. ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ వచ్చాక కూడా తగ్గలేదు. అమెరికా లాంటి దేశంలో రోజూ లక్ష దాకా కొత్త కేసులు వస్తున్నాయి. అందువల్ల అనిశ్చితి కొనసాగుతోంది. పెట్టుబడి దారులు బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌గా భావిస్తున్నారు. ఐతే... డబ్బంతా బంగారంపైనే పెట్టకుండా కొంత బిట్‌కాయిన్, కొంత స్టాక్ మార్కెట్లకు కూడా మళ్లిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం అన్నీ దూసుకెళ్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5 నెలలుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు రూ.41,100 ఉంది. ఇప్పుడు రూ.44,510 ఉంది. అంటే 5 నెలల్లో ధర రూ.3,410 పెరిగినట్లు లెక్క. అలాగే... మార్చి 31న 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ (investment gold) 10 గ్రాములు రూ.44,840 ఉంటే ఇప్పుడు రూ.48,560 ఉంది. అంటే 5 నెలల్లో ధర రూ.3,720 పెరిగినట్లు లెక్క. మరో మూడ్రోజుల్లో వినాయకచవితి, ఆ తర్వాత దసరా, దీపావళి, ధంతేరస్ ఇలా వరుస పండుగలు వస్తున్నాయి కాబట్టి బంగారు నగల కొనుగోళ్లు పెరిగి... ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Rates 7-9-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,451 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,608 ఉంది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,510 ఉంది. నిన్న 10 గ్రాముల బంగారం ధరలో మార్పు లేదు. 8 రోజుల్లో బంగారం ధర రూ.50 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,510 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,510 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,510 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,510 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,970 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,660 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.47,010 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,410 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 7-9-2021: వెండి ధర నిన్న కొద్దిగా పెరిగింది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.69.80 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.558.40 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.698 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,980 ఉండగా... కేజీ వెండి ధర... రూ.69,800 ఉంది. మార్చి 31న కేజీ వెండి ధర రూ.67,300 ఉంది. ఇప్పుడు రూ.69,800 ఉంది. అంటే... ఈ 159 రోజుల్లో వెండి ధర రూ.2500 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: ఆగస్టులోనే కాదు... సెప్టెంబర్‌లో కూడా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. ఆల్‌టైమ్ రికార్డులు నమోదుచేస్తున్నాయి. నిన్న ఐటీ కంపెనీలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకెళ్లడంతో... సెన్సెక్స్ 166, నిఫ్టీ 54 పాయింట్లు బలపడి సరికొత్త రికార్డులకు ఎగబాకాయి. చూస్తుంటే నెగెటివ్ ప్రభావాలేవీ ప్రస్తుతం మార్కెట్లపై కనిపించట్లేదు. ఇంతలా మార్కెట్లు దూసుకెళ్లడం ఇండియాలో కరోనా వచ్చాక ఇదే తొలిసారి అనుకోవచ్చు. స్టాక్ మార్కెట్లలోకి ఎంటర్ అవ్వాలి అనుకునేవారు... ఇప్పుడే రావాలనీ... మరింత ఆలస్యం చేస్తే... షేర్ల ధరలు బాగా పెరిగిపోయే అవకాశం ఉందని అని నిపుణులు అంచనా వేస్తున్నారు. (image credit - twitter - reuters)