1. బంగారం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బేసిక్ ఇంపోర్ట్ ట్యాక్స్‌ను (Import Tax) 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. ఒకేసారి 5 శాతం దిగుమతి సుంకం పెరిగింది. రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోవడంతో దిగుమతులను అరికట్టేందుకు ఈ చర్య తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
2. మేలో బంగారం దిగుమతులు మొత్తం 107 టన్నులు కాగా, జూన్‌లో ఎగుమతులు కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచంలో బంగారాన్ని వినియోగించే దేశాల్లో రెండవ అతిపెద్ద దేశంగా ఉన్న భారతదేశం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్న కారణంగా అధిక వాణిజ్యం, కరెంట్ ఖాతా లోటులను చూస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మే నెలలో దేశ వాణిజ్య లోటు అత్యధికంగా 24.29 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశం మేలో 6.03 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది తొమ్మిది రెట్లు పెరిగింది. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత డిమాండ్ కోలుకోవడంతో భారత్ గతేడాది దశాబ్దంలోనే అత్యధిక మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. బంగారం అక్రమ రవాణాను తగ్గించేందుకు 2022 బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని దేశంలోని ప్రముఖ ఆభరణాల వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరారు. కానీ దిగుమతి సుంకం విషయంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దేశీయ మార్కెట్‌ను బలోపేతం చేసేందుకు చైనా, అమెరికా, సింగపూర్ వంటి దేశాలు బంగారంపై దిగుమతి సుంకాన్ని తొలగించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర ఏకంగా రూ.1,310 పెరిగి రూ.52,200 ధరకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర ఏకంగా రూ.1,200 పెరిగి రూ.47,850 ధరకు చేరుకుంది. కిలో వెండిపై రూ.100 తగ్గి రూ.65,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)