బంగారంపై అమ్మకాల ఒత్తిడి కొనసాగవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ కమొడిటీ రీసెర్చ్ అనలిస్ట్ నిరుపేంద్ర యాదవ్ తెలిపారు. బంగారం ధర రూ. 55 వేల వద్ద మద్దతు ఉందన్నారు. ఒకవేళ పైకి చేరితే రూ. 57 వేల వద్ద నిరోధం ఉందని తెలిపారు. వెండికి రూ. 61,500 వద్ద మద్దతు, రూ. 67,400 వద్ద నిరోధం ఉందని వివరించారు.