Gold Silver Prices | బంగారం ధరలు షాకిచ్చాయి. తగ్గినట్లే తగ్గి పసిడి రేటు పరుగులు పెట్టింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భాావించే వారిపై ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు.
Gold Rate Today | బంగారం కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్. పసిడి రేటు మళ్లీ పరుగులు పెట్టింది. బంగారం ధర తగ్గినట్లే తగ్గి మళ్లీ పైకి కదిలింది. ఈ రోజు బంగారం ధరలు పైపైకి కదిలాయి. గోల్డ్ రేటు ర్యాలీ చేస్తే.. వెండి ధర మాత్రం పడిపోయింది.
2/ 9
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు జిగేల్ మన్నాయి. ఫిబ్రవరి 6న పసిడి రేటు దూసుకుపోయింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రనూ. 57,440కు చేరింది.
3/ 9
అలాగే ఆర్నమెంటల్ గోల్డ్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పైకి కదిలింది. రూ. 250 మేర దూసుకుపోయింది. దీంతో పది గ్రాములకు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,650కు చేరింది.
4/ 9
బంగారం ధరలు గత మూడు రోజుల కాలంలో భారీ తగ్గిన విషయం తెలిసిందే. బంగారం ధర ఈ కాలంలో రూ. 1300కు పైగా పతనమైంది. అయితే తర్వాత మళ్లీ పసిడి రేటు పైకి చేరింది. నేడు రూ. 280 దూసుకుపోయింది.
5/ 9
బంగారం ధరలు పెరిగితే వెండి రేటు మాత్రం పడిపోయింది. సిల్వర్ రేటు ఈ రోజు కూడా పతనమైంది. రూ. 200 మేర దిగి వచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ. 74 వేలకు పడిపోయింది. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.
6/ 9
సిల్వర్ రేటు గత మూడు రోజుల్లో చూస్తే.. ఏకంగా రూ. 3600 పతనమైంది. ఈరోజు తగ్గుదలను కూడా కలుపుకుంటే.. వెండి ధర నాలుగు రోజుల్లో రూ. 3,800 పతనమైందని చెప్పుకోవచ్చు. ఇది వెండి ప్రియులకు ఊరట కలిగించే అంశం.
7/ 9
బంగారం, వెండి ధరలకు జీఎస్టీ, తయారీ చార్జీలు వంటివి అదనం. అందువల్ల బంగారం, వెండి ధరల్లో కొంత మేర వ్యత్యాసం ఉండొచ్చు. తయారీ చార్జీలు అనేవి మీ ఎంపిక చేసుకునే జువెలరీ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి.
8/ 9
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. గోల్డ్ రేటు ఔన్స్2కు 0.68 శాతం మేర ర్యాలీ చేసింది. దీంతో బంగారం రేటు 1889 డాలర్లక చేరింది. ఇక వెండి ధర 0.46 శాతం ర్యాలీ చేసింది. ఔన్స్‌కు 22.5 డాలర్లకు చేరింది.
9/ 9
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని చెప్పుకోవచ్చు. దీని వల్ల మన దేశంలో కూడా బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు రానున్న కాలంలో మరింత పైకి చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. రూ. 65 వేలకు చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.